వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫాలో అయితే అంతే: హెచ్ఐవీ ఇలా సోకుతుందట..కేరళ బయాలజీ బుక్ చెబుతోంది

|
Google Oneindia TeluguNews

పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు జ్ఞానాన్ని ఇచ్చేలా ఉండాలి కానీ తప్పుడు సమాచారం ఇచ్చేలా ఉండకూడదు. కేరళలో పదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో తప్పుడు సమాచారం ముద్రించారు. విద్యార్థులు కూడా ఇదే చదువుతున్నారు. ఇక కొద్ది రోజుల్లో పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయనున్నారు విద్యార్థులు. ఈ సమయంలో ఇలా పాఠ్యపుస్తకాల్లో తప్పుడు సమాచారం ముద్రించడంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.

అక్షరాస్యతలో ముందున్న కేరళ రాష్ట్రం

అక్షరాస్యతలో ముందున్న కేరళ రాష్ట్రం

కేరళ రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలోనే ముందుంది. అలాంటి రాష్ట్రంలో పాఠ్యపుస్తకాల్లో దారుణమైన తప్పు దొర్లింది. ఇది ఒకటవ తరగతి లేదా రెండవ తరగతి పుస్తకాల్లో దొర్లిన తప్పు కాదు. మరికొన్ని రోజుల్లో బోర్డు పరీక్ష రాయనున్న పదవ తరగతి విద్యార్థులు చదువుకునే బయాలజీ పాఠ్యపుసక్తంలో తప్పు దొర్లింది. విద్యార్థులు కూడా ఈ తప్పుడు సమాచారంనే చదువుకుంటున్నారు.

పెళ్లికి ముందు లైంగిక కలయికతో హెచ్ఐవీ సోకుతుందా..?

పెళ్లికి ముందు లైంగిక కలయికతో హెచ్ఐవీ సోకుతుందా..?

ఇక అసలు విషయానికొస్తే పదవ తరగతి బయాలజీ పుస్తకంలో హెచ్‌ఐవీ ఎలా వ్యాప్తి చెందుతుందనే దానిపై తప్పుడు సమాచారం ముద్రించడం జరిగింది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే హెచ్‌ఐవీ సోకుతుందనే సమాచారంను బయాలజీ పాఠ్యపుస్తకంలో పొందుపర్చారు. అంతేకాదు ఒకవేళ పెళ్లి జరిగిన తర్వాత మరో అక్రమ సంబంధం కలిగి లైంగికంగా కలిస్తే అప్పుడు కూడా ఈ ప్రమాదకర హెచ్‌ఐవీ వైరస్ సోకే అవకాశం ఉందని బయాలజీ పాఠ్యపుసక్తంలో ఉంది. ఇది ఆ పుస్తకంలోని 60వ పేజీలో ఉన్నట్లు ఉంది. ఈ పుస్తకాన్ని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రచురించింది.

స్ట్రాంగ్ వార్నింగ్ : భారత్‌లో పాక్ మరో ఉగ్రదాడికి దిగితే ఏం చేస్తామో తెలుసా..?స్ట్రాంగ్ వార్నింగ్ : భారత్‌లో పాక్ మరో ఉగ్రదాడికి దిగితే ఏం చేస్తామో తెలుసా..?

పదవ తరగతి బయాలజీ పుస్తకంలో దొర్లిన తప్పు

పదవ తరగతి బయాలజీ పుస్తకంలో దొర్లిన తప్పు

హెచ్ఐవీ వ్యాధి ఎలా ఇతరులకు సోకుతుందో అనే అంశంపై పుస్తకంలో గ్రాఫ్స్‌తో సహా వివరించడం జరిగింది. ఇందుకు కారణం పెళ్లికి ముందు కానీ, పెళ్లికి తర్వాత గానీ మరొకరితో లైంగిక సంబంధాలు కలిగి ఉంటే హెచ్ఐవీ సోకుతుందని ఆ పేజీలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. పిల్లలకు పాఠం చెబుతున్న టీచర్ దీన్ని గుర్తించి తప్పుడు సమాచారంను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ఇదే విషయాన్ని చాలా మంది షేర్ చేయడం అందులో వైద్యులు కూడా ఉండటంతో పెద్ద ఎత్తున పోస్టు వైరల్ అయ్యింది. అయితే ఈ తప్పుడు సమాచారంను గుర్తించడం జరిగిందని ఓ అధికారి వెల్లడించారు.

తప్పుడు సమాచారం ముద్రణకు గురైన విషయం తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుతానికి దాన్ని తీసేయాల్సిందిగా పాఠశాలలకు తెలిపామని చెప్పారు అధికారి. ఇక ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రారంభం కానున్న విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రింట్ కానున్న పుస్తకాల్లో ఇలాంటి తప్పులు లేకుండా చూస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే తప్పుడు సమాచారం కలిగి ఉన్న ఈ పుస్తకం 2015-2016 నుంచే ఉన్నట్లు గుర్తించారు.

English summary
A Class X textbook in Kerala has been teaching students that pre-marital sex can spread HIV. This misleading information is printed in a Class X biology text book.The textbook has a page that states that Human Immunodeficiency Viruses (HIV) can spread through premarital or extramarital sexual conduct.This information is published on page 60 of the Class X Biology textbook published by State Council of Education Research and Training (SCERT).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X