వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్మాంగం కోసేసిన యువతికి సీఎం అభినందన: ఆమె చర్య సాహసోపేతమైనది!..

కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతోనో, భక్తి పేరుతోనో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి మర్మాంగాన్ని కోసేసినందుకు కేరళ సీఎం పినరయి విజయన్ ఆ యువతిని అభినందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు.

కాగా, కేరళకు చెందిన ఒక దొంగ స్వామి ఓ న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా.. గట్టిగా ప్రతిఘటించిన ఆ విద్యార్థిని అతని మర్మాంగాన్ని కోసిపారేసింది. కొల్లాంలోని పన్మన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గణేశానంద తీర్థపద స్వామి(54)అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.

Kerala CM Pinarayi Vijayan lauds girl who cut off her rapist's genitals, says it was 'courageous'

అయితే తీర్థపద స్వామిని సదరు విద్యార్థిని ఎంత వారించినా అతను వినలేదు. దీంతో అతన్ని అడ్డుకోవడానికి.. తన వద్దనున్న చాకుతో పురుషాంగాన్ని కోసేసింది. అనంతరం తిరువనంతపురం పోలీసులకు విద్యార్థినే ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులు కూడా విద్యార్థినిపై కేసు పెట్టకుండా.. ఆ దొంగస్వామి పైనే పోస్కో చట్టం కింద కేసు పెట్టారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు కేరళ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతోనో, భక్తి పేరుతోనో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

English summary
The 22-year-old girl told the police that the sanyasi, an inmate from Panmana Ashram, had been repeatedly raping her for the past seven years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X