• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Lockdown: కరోనా కాలంలో సీఎం కూతురు రెండో పెళ్లి, ఐటీ కంపెనీ ఎండీ, పెళ్లి కొడుకు ఎవరంటే ?

|

కొచ్చి/ న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యారు. సీఎం కూతురు స్టారప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక పెళ్లి కొడుకు ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అయితే సీఎం కూతురికి గతంలో వివాహం జరిగి ఓ కుమారుడు ఉన్నాడు. పెళ్లి కొడుకు గతంలో పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు కరోనా కాలంలో సీఎం కూతురు, ప్రముఖ రాజకీయ నాయకుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

 సీఎం కూతురు బెంగళూరు కంపెనీ ఎండీ

సీఎం కూతురు బెంగళూరు కంపెనీ ఎండీ

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎంత సింపుల్ గా ఉంటారో చెప్పనవసం లేదు. తాను ఓ రాష్ట్రానికి సీఎం అని ఎప్పుడూ, ఎక్కడా పినరయి విజయన్ హంగామా చెయ్యలేదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కమల విజయన్ దంపతుల పెద్ద కుమార్తె వీణా బెంగళూరులో ఆరు సంవత్సరాల క్రితం సొంతంగా స్టారప్ సంస్థ ఎక్సోలాజిక్ సెల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వీణా ఒరాకిల్ సంస్థతో కలిసి పని చేశారు. తరువాత ఆర్ పీ టెక్సాఫ్ట్ సీఇవోగా పని చేసిన అనుభవంతో వీణా సొంతంగా కంపెనీ స్థాపించారు.

 పెళ్లి కొడుకు ఈయనే !

పెళ్లి కొడుకు ఈయనే !

సీపీఎం (M) రాజకీయ పార్టీ అనుభంద సంస్థ అయిన డీవైఎఫ్ఐ (DYFI) జాతీయ విభాగం అధ్యక్షుడిగా పీఏ. మహమ్మద్ రియాజ్ పని చేస్తున్నాడు. సీపీఎం (M) కమిటీలో కూడా మహమ్మద్ రియాజ్ ఉన్నాడు. కేరళలోని కోజికోడ్ కు చెందిన మహమ్మద్ రియాజ్ మళయాలంలో విద్యాభ్యాసం చేశాడు. చురుకైన రాజకీయ నాయకుడిగా మహమ్మద్ రియాజ్ కు మంచి పేరు ఉంది.

 సీఎం కూతురికి, పెళ్లి కొడుక్కి రెండో పెళ్లి

సీఎం కూతురికి, పెళ్లి కొడుక్కి రెండో పెళ్లి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాకు గతంలోనే వివాహం అయ్యింది. మొదటి భర్తతో కాపురం చేసే సమయంలో వీణాకు ఒక కొడుకు పుట్టాడు. పెళ్లి కొడుకు మహమ్మద్ రియాజ్ కు కూడా గతంలో వేరే మహిళతో వివాహం అయ్యింది. పెళ్లి కొడుకు మహమ్మద్ రియాజ్ కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు.

 గోడ్డు మాంసం కోసం మోదీతో పోరాటం

గోడ్డు మాంసం కోసం మోదీతో పోరాటం

పాఠశాల, కాలేజ్ లో విద్యాభ్యాసం చేసే సమయంలోనే మహమ్మద్ రియాజ్ డీవైఎఫ్ఐ నాయకుడిగా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేశారు. 2017లో డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా మహమ్మద్ రియాజ్ భాద్యతలు స్వీకరించాడు, ప్రతినిత్యం టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 2017 గోవులు, జంతువులను గోవధ శాలలకు తరలించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అప్పట్లో మహమ్మద్ రియాజ్ వ్యతిరేకించారు. గోవు మాంసం (గోడ్డు మాంసం) సరఫరా చెయ్యాలని పోరాటం చేస్తున్న వారికి మద్దతుగా మహమ్మద్ రియాజ్ కేరళలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు. 2009 లోక్ సభ ఎన్నికల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసిన మహమ్మద్ రియాజ్ యూడీఎఫ్ నేత రాఘవన్ చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

  A Man Tranferred His Property To His Two Elephants In Bihar
   కరోనా కాలంలో సీఎం కూతురి రెండో పెళ్లి

  కరోనా కాలంలో సీఎం కూతురి రెండో పెళ్లి

  కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా, సీపీఎం (M) నాయకుడు మహమ్మద్ రియాజ్ ల పెళ్లి జూన్ 15వ తేదీన కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో సీఎం కూతురు వీణా, మహమ్మద్ రియాజ్ ల పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిపించాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిసింది. మొత్తం మీద సీఎం కూతురు వీణా రెండో పెళ్లి, ఇద్దరు బిడ్డల తండ్రి మహమ్మద్ రియాజ్ తో జరగడానికి డేట్ ఫిక్స్ అయిపోయింది.

  English summary
  Lockdown: PA Muhammad Riyas, national President of Democratic Youth Federation of India (DYFI) the youth wing of CPI(M) and IT entrepreneur Veena Thayikkandiyil are getting married soon, a source told TNM.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more