వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది భారత వలస కార్మికుల కోసం కేరళ సీఎం..ప్రధానికి లేఖ

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: జీవనోపాధిని వెదుక్కుంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు తరలి వెళ్లిన భారతీయులను వెంటనే స్వదేశానికి రప్పించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన రాసిన ఆ లేఖను పినరయి.. సోమవారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి గల్ఫ్ దేశాలన్నీ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాయని, ఈ పరిస్థితుల్లో భారతీయ వలస కూలీలు అక్కడ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు.

యుఏఈలో చాలినన్ని క్వారంటైన్స్ లేవంటూ..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చాలినన్ని క్వారంటైన్ సెంటర్లు, ఐసొలేషన్ వార్డులు లేవని పినరయి తన లేఖలో పేర్కొన్నారు. ఒక్క యుఏఈలోనే 30 లక్షలకు పైగా భారతీయ వలస కూలీలు జీవనోనాధి కోసం అక్కడ నివసిస్తున్నారని చెప్పారు. దుబాయ్ సహా ఏ ఒక్క నగరంలో కూడా చాలినన్ని క్వారంటైన్లు లేవనే విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. యుఏఈలో 10 లక్షల మందికి పైగా మలయాళీలు నివసిస్తున్నారని, వారంతా బ్లూ కాలర్ పనులు, దినసరి వేతన కార్మికులుగా ఉన్నారని చెప్పారు. జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో నివసిస్తుండటం వల్ల త్వరగా కరోనా వైరస్ బారిన పడటానికి అవకాశం ఉందని చెప్పారు.

Kerala CM Pinarayi Vijayan writes to PM Modi, says UAE quarantine facilities inadequate

చాలినంత ఆహారం.. వైద్య సదుపాయాలు..

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16

ఇన్ని లక్షల మంది భారతీయులను నిరాశ్రయులుగా ఉన్నారని, వారిని స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలను తీసుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. స్వదేశానికి వచ్చిన మలయాళీలకు క్వారంటైన్ సదుపాయాన్ని కల్పించనడానికి, ఆహారం, వైద్య సదుపాయాలను అందజేయడానికి సహకరించాలని విజ్ఙప్తి చేశారు. ఇదివరకు విదేశాల్లో ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడానికి కేంద్రం ప్రత్యేకంగా విమానాలను నడిపించిందని, అదే తరహాలో వలస కార్మికులను కూడా స్వదేశానికి తీసుకుని రావాలని అన్నారు.

English summary
The chief minister of India's Kerala state has urged Prime Minister Narendra Modi to repatriate Indian workers in the United Arab Emirates (UAE) amid the coronavirus pandemic, expressing alarm over the Gulf country's response to the health emergency. In a letter sent on April 9, Pinarayi Vijayan revealed that numerous complaints were being received over "inadequate isolation and quarantine facilities" in the UAE, which is currently hosting more than three million migrant workers from India, according to the United Nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X