వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం వర్సెస్ కేరళ: 11 మంది సీఎంలకు విజయన్ లేఖలు.. కేసీఆర్‌ను మరిచారు..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై గట్టిపట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఆన్ లైన్ ద్వారా సీఏఏ అమలు చేయాలని భావిస్తున్నవేళ.. కేరళ ప్రభుత్వం సరికొత్త పోరాటానికి తెరలేపింది. సీఏఏ విషయంలో మొండిగా వ్యవహరిస్తోన్న కేంద్రాన్ని కలిసి ఢీకొడదామంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం 11 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. సీఏఏ చట్టాన్ని రాష్ట్రంలో అమలుచేయబోమంటూ కేరళ అసెంబ్లీ ఇటీవలే తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

పౌరసత్వ సవరణ

పౌరసత్వ సవరణ

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమాజంలోని అన్ని వర్గాలూ తీవ్రంగా వ్యతిరేకించాయని, దేశంలో ప్రజాస్వామ్యాం, లౌకికవాద విలువల్ని కాపాడుకోడానికి భారతీయులంతా ఏకం కావాల్సిన టైమొచ్చిందని, అన్ని వర్గాలూ విభేధాల్ని పక్కనపెట్టి ప్రజాస్వామ్య పరిరక్షిణ కోసం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని కేరళ సీఎం విజయన్ తన లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి తొలి అడుగుగా భావిస్తోన్న నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ పీఆర్)ను కూడా కేరళలో చేపట్టబోవడంలదేన్న విషయాన్నీ ఆయన గుర్తుచేశారు.

ఎవరెవరికి లేఖలు రాశారంటే..

ఎవరెవరికి లేఖలు రాశారంటే..

సీఏఏపై కలిసి పోరాడుదామంటూ కేరళ సీఎం విజయన్.. మొత్తం 11 మంది ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. వారిలో ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పాండిచేరి, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ సీఎంలు ఉన్నారు. వీరిలో బిహార్ సీఎం నితీశ్ ఒక్కరే బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తుండా, మిగతా వాళ్లంతా నాన్ బీజేపీ సీఎంలే కావడం గమనార్హం. సీఏఏపై కేరళ అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రం ‘ఆన్ లైన్' ఐడియాను తెరపైకి తెచ్చిన దరమిలా రాష్ట్రాలు సంఘటితంగా పోరాడాలని విజయన్ భావిస్తున్నారు.

కేసీఆర్‌ను మర్చిపోయారే?

కేసీఆర్‌ను మర్చిపోయారే?


దేశవ్యాప్తంగా ఉన్న నాన్ బీజేపీ ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన కేరళ సీఎం.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాత్రం మర్చిపోవడం చర్చనీయాంశమైంది. సీఏఏపై తొలి నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోన్న టీఆర్ఎస్..పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడం ద్వారా తన వైఖరిని స్పష్టం చేసింది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు నేరుగా సీఏఏకు వ్యతిరేకంగా ప్రకటన చేయకపోవడం, ఆ చట్టాన్ని తెలంగాణలో అమలు చేసేదీ లేనిదీ వెల్లడించకపోవడం వల్లే విజయన్ లేఖ రాయలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయన్ జాబితాలో ఛత్తీస్ గఢ్ సీఎం పేరు కూడా లేకపోవడం గమనార్హం.

English summary
Kerala Chief Minister Pinarayi Vijayan Friday wrote letters to 11 non-BJP chief ministers in the country in a bid to build unity among the states against the Citizenship Amendment Act (CAA)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X