వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపలు అమ్మిన ఆ యువతి: కేరళ వరద బాధితులకు రూ.1.5 లక్షల సాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళకు చెందిన 19 ఏళ్ల హనన్ గుర్తుందా? ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కాలేజీకి వెళ్లివచ్చాక చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. దీనిపై మతఛాందసవదులు విమర్శలు గుప్పించారు. అప్పుడు ఇందుకు సంబంధించిన వార్త ఇంటర్నెట్లో వైరల్ అయింది.

నా బతుకు బతకనివ్వండి: చేపలు అమ్ముతూ కాలేజీ అమ్మాయి, ఆసక్తికర 'స్టోరీ'!నా బతుకు బతకనివ్వండి: చేపలు అమ్ముతూ కాలేజీ అమ్మాయి, ఆసక్తికర 'స్టోరీ'!

ఆ హనన్.. ఇప్పుడు కేరళ వరద బాధితులకు రూ.1.5 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఆమె ఈ మొత్తాన్ని చీఫ్ మినిస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కు (సీఎండీఆర్ఎఫ్)కు ఇచ్చారు. సాయంగా తన అకౌంట్లోకి వచ్చిన లక్షన్నర రూపాయలను ఇస్తున్నట్లు తెలిపారు.

Kerala College Girl Bullied For Selling Fish, Donates Rs 1.5 Lakhs She Got As Support To Flood Relief

దీనిపై సదరు యువతి మాట్లాడుతూ.. తాను ఇటీవల కొత్తమంగళం రిలీఫ్ క్యాంపును సందర్శించానని, అక్కడ ఎందరో నిరాశ్రయులు ఇబ్బందులు పడుతుండటం తాను చూశానని చెప్పారు. వారు ఆహారం, దుస్తులు, ఇతర సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

Recommended Video

చేపలు అమ్ముకుంటున్న అమ్మాయికి కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌

తాను ఇలాంటి ఇబ్బందులను తన జీవితంలో ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు ఎంతోమంది సహాయం చేశారని చెప్పారు. వారి సహాయంతో తన అకౌంట్లోకి కొంత మొత్తం వచ్చిందన్నారు. ఇందులో నుంచి రూ.1.5 లక్షలు వరద సాయంగా ఇస్తున్నానని చెప్పారు. ఈ మొత్తాన్ని తాను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అకౌంట్లోకి ట్రాన్సుఫర్ చేస్తున్నట్లు తెలిపారు.

English summary
Hanan Hanai, the 19 year old Kerala student who had become victim of massive cyber trolling last month after photos of her in uniform selling fish went viral has donated Rs 1.5 lakhs to the Chief Minister's Distress Relief Fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X