వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ సీఎం విజయన్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం: 24నే ముహూర్తం

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఆగస్టు 24న అవిశ్వాస తీర్మానం పెడతామని కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో జరిగిన భారీ అవినీతికి బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.

మరోవైపు కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కాల్ డేటా రికార్డులను సేకరించరాదని పోలీసులను ఆదేశించాలంటూ కేరళ హైకోర్టులో రమేష్ చెన్నితల పిటిషన్ దాఖలు చేశారు. అయితే, దాన్ని కోర్టు కొట్టిపారేసింది. కేరళ ప్రభుత్వం కోవిడ్ బాధితుల కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమే వివరాలు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చింది. కాగా, ప్రభుత్వం వాదనతో ఏకీభవించిన హైకోర్టు రమేష్ చెన్నితల పిటిషన్‌ను కొట్టివేసింది.

Kerala Congress leader Ramesh Chennithala threatens to bring no-confidence motion against CM Vijayan

మహమ్మారి వ్యాప్తిని కలిగి ఉండటానికి, బాధిత వ్యక్తులతో మొదటి సంబంధాన్ని కలిగి ఉన్నవారిని నిర్బంధించడానికి ఈ చర్య చాలా అవసరం, సిడిఆర్‌లను ఖచ్చితంగా గోప్యంగా ఉంచడం జరుగుతోంది, టవర్ స్థానాన్ని గుర్తించే పరిమిత ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.

కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,199కు చేరింది. 18,124 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 33,824 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి 192 మంది మరణించారు. గురువారం కొత్తగా 1968 కేసులు నమోదు కాగా, 9 మంది మరణించారు.

English summary
Kerala's Leader of Opposition Ramesh Chennithala on Friday (August 21) sought the resignation of Chief Minister Pinarayi Vijayan citing rampant corruption on the pretext of COVID-19 pandemic. Chennithala said the Congress will be bringing a no-confidence motion against the government in the one-day long Assembly session on Monday (August 24).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X