• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరుసగా 4వరోజు 20వేల కొత్త కేసులు -Keralaలో కొవిడ్ థర్డ్‌వేవ్‌ మొదలైనట్లేనా -బీజేపీకి భిన్నంగా రాహుల్ హెచ్చరిక

|

అన్ని విషయాల్లో ముందుండే కేరళ కరోనా మహమ్మారి విషయంలోనూ అదే తీరుగా ఉంది. దేశంలో కొవిడ్ థర్డ్‌వేవ్‌ కేరళ నుంచే ఆరంభమైందా అనే అనుమానాలను మరింత బలపరుస్తూ అక్కడ వరుసగా నాలుగో రోజు 20వేల పైచిలుకు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా పరిస్థితిపై పినరయి విజయన్ సర్కారును బీజేపీ నిందిస్తోంటే, కాంగ్రెస్ జాతీయ నేతలు మాత్రం లెఫ్ ను తిట్టకుండా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలివి..

జగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామజగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామ

కేరళ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 20,701 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,70,137కు చేరింది. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.61శాతానికి చేరడం కలవరపెడుతున్నది.

Kerala Covid update: 20,772 New Cases, 116 Deaths in Last 24hrs, Rahul Gandhi worried

నిన్న ఒక్కరోజే కేరళలో కొవిడ్ కాటుకు 116 మంది బలయ్యారు. తద్వారా మొత్తం మరణాల సంఖ్య 16,701కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14,651మంది బాధితులు కొవిడ్ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 31,92,104కు చేరింది. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,60,824గా ఉంది. ఇది దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులు కావడం గమనార్హం. అత్యధికంగా (63 లక్షల) కేసులున్న మహారాష్ట్రలోనే 78వేల యాక్టివ్ కేసులుంటే, రెండో స్థానంలో ఉన్న కేరళలో యాక్టివ్ కేసులు రెట్టింపు ఉన్నాయి.

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

ఐసీఎంఆర్‌ చేసిన నేషనల్‌ సీరోసర్వేలో దేశంలో అత్యల్ప యాంటీబాడీలున్న రాష్ట్రంగా కేరళ(44 శాతం) నిలిచింది. అంటే రాష్ట్ర జనాభాలో 56 శాతం మందికి కోవిడ్‌ ముప్పుందని తేలుస్తోంది. కేరళ జనాభాలో 15 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారు కావడం, డయాబెటిస్‌లాంటి వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా ఎక్కువ ఉండటంతో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా మూడో వేవ్ కు కేరళే కేంద్రంగా నిలవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా,

కేరళలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ప్రజలను ట్విటర్ వేదికగా శుక్రవారం కోరారు. కేరళలో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. తగిన రక్షణ చర్యలు, మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆంక్షలు సడలించడం వల్లే కేరళలో కరోనా పెరిగిందని బీజేపీ జాతీయ నేతలు సైతం పినరయి విజయన్ పై విమర్శలు చేస్తోంటే, రాహుల్ మాత్రం రాజకీయాల జోలికి పోలేదు.

English summary
Kerala for the fourth day running registered over 20,000 new cases of coronavirus in the state with the test positivity rate (TPR) rising to 13.61% and 116 more people succumbing to Covid-19. With 20,772 cases in a span of 24 hours, the infection caseload in the state reached 33,70,137 and the 116 deaths pushed the total casualties to 16,701, a state government release said. Amid a continuous surge in COVID-19 cases in Kerala, Congress MP Rahul Gandhi termed the coronavirus situation in the state as 'worrying'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X