వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెండ్లి వేడుకలో డీజే మోతకు నో.. కేరళలో సీపీఎం సీరియస్ యాక్షన్

|
Google Oneindia TeluguNews

ఆమధ్య తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన కొందరు నేతల ఇండ్లల్లో పెండ్లిళ్లు ధూంధాంగా జరగడం, వాళ్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం గుర్తుండే ఉంటుంది. తెలుగు నేతల్లాగే కేరళలోనూ ఓ కమ్యూనిస్టు నేత తన కొడుకు పెండ్లిని ఆడంబరంగా నిర్వహించారు. అయితే అక్కడి రాష్ట్ర పార్టీ మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. సదరు నేతపై ఏకంగా ఆరు నెలల నిషేధం విధించింది.

కేరళలోని అలెప్పీ జిల్లాకు చెందిన సీపీఎం నేత మనోహరన్ ఈ నెల 13న తన కొడుకు పెండ్లి చేశారు. రిసెప్షన్ వేడుకలో డీజే బాజాతో ఎక్కడలేని హడావుడితో హోరెత్తించారు. పెండ్లిళ్లు, ఇతర వేడుకలు చాలా సింపుల్ గా జరుపుకోవాలన్న రూల్ ని ధిక్కరించారన్న కారణంతో మనోహరన్ పై ఆరు నెలలు సస్పెన్షన్ వేట వేస్తున్నట్లు అలెప్పీ జిల్లా సీపీఎం కార్యదర్శి నజీర్ తెలిపారు.

Kerala CPI-M Has suspended Its own leader For Organising DJ Party at Sons Wedding

తప్పు నాది కాదు.. పెండ్లికొడుకుదే..
కాగా, పెండ్లిలో డీజే బాజా వద్దని ఎంత చెప్పినా, తన కొడుకు వినిపించుకోలేదని, ఈ వ్యవహారంలో తాను సస్పెండ్ కావడం బాధాకరమని సీపీఎం బహిష్కత నేత మనోహరన్ చెప్పుకొచ్చారు. డీజే డ్యాన్సులు చేసిన ఊపులో కొందరు యువకులు వీధుల్లో రచ్చ చేశాయడంతోపాటు స్థానికులతో గొడవపడ్డారని, ఇది పెద్దది కావొద్దన్న ఉద్దేశంతోనే నేతపై వేటేసినట్లు సీపీఎం వర్గాలు వెల్లడించాయి.

English summary
As Kerala CMI(M) decision was to organise simple wedding ceremonies, One of its leader suspended for Organising DJ Party at Son's Wedding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X