వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో బర్డ్ ఫ్లూ భయం .. అలెర్ట్ అయిన ప్రభుత్వం .. రాష్ట్ర విపత్తుగా ప్ర‌కటన .. హైఅలెర్ట్

|
Google Oneindia TeluguNews

కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ గా పిలువబడే ఏవియన్ ఇన్ ఫ్లూఎంజాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. కొట్టాయం, అలప్పుజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాక కేరళ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది.

మానవులకు కూడా బర్డ్ ఫ్లూ వైరస్ సంభవించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు రాష్ట్రంలో హై అలర్ట్ జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అలప్పుజ , కొట్టాయం జిల్లాలలో బర్డ్ ఫ్లూ

అలప్పుజ , కొట్టాయం జిల్లాలలో బర్డ్ ఫ్లూ

బాధిత ప్రాంతాలకు ఒక కిలోమీటర్ వరకు మరియు చుట్టుపక్కల బాతులు, కోళ్ళు మరియు ఇతర దేశీయ పక్షులను చంపేయాలని సోమవారం ప్రభుత్వం అధికారులకు ఆదేశించారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌లో నిర్వహించిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉన్నట్లు నిర్ధారించామని అధికారులు తెలిపారు.

అలప్పుజ జిల్లాలోని కుట్టనాడ్ ప్రాంతంలోని నేదుముడి, తకాళి, పల్లిప్పడ్ మరియు కరువత్తా అనే నాలుగు పంచాయతీల నుండి , అలాగే కొట్టాయం జిల్లాలోని నీందూర్ పంచాయతీలో బర్డ్ ఫ్లూ నివేదించబడింది.

2016లో కేరళలో బర్డ్ ఫ్లూ .. మళ్ళీ ఇప్పుడు

2016లో కేరళలో బర్డ్ ఫ్లూ .. మళ్ళీ ఇప్పుడు

వైరస్ సంక్రమణ కారణంగా ఒక రైతు పొలంలో సుమారు 1,700 బాతులు చనిపోయాయి. కోళ్లు, టర్కీలు, బాతులు మరియు పెద్దబాతులు వంటి దేశీయ పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన పక్షి మలం లేదా దాని ముక్కు, నోరు లేదా కంటి నుండి స్రావాల ద్వారా సంక్రమిస్తుంది. కేరళలో బర్డ్ ఫ్లూ చివరి కేసు 2016 లో నమోదైంది.

గత ఒక వారంలో, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా మరియు మధ్యప్రదేశ్ వంటి మరో నాలుగు రాష్ట్రాల నుండి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

 చికెన్ , బాతులు ,మాంసం విక్రయాలపై నిషేధం

చికెన్ , బాతులు ,మాంసం విక్రయాలపై నిషేధం

హర్యానా నుండి లక్షల సంఖ్యలో పక్షులు చనిపోయినట్లు నివేదించగా, హిమాచల్ ప్రదేశ్‌లో వలస పక్షులు చనిపోయాయి. మధ్యప్రదేశ్‌లో గత ఒక వారంలో వందలాది కాకులు చనిపోయినట్లు గుర్తించారు. కేరళలో, హెచ్ 5 ఎన్ 8 వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి కుట్టనాడ్ ప్రాంతంలో మాత్రమే 34,000 తో కలిపి మొత్తం 40,000 పక్షులను చంపాలని అధికారులు నిర్ణయించారు.
కుట్టనాడ్ మరియు కార్తీకపల్లి తాలూకాలలో బాతులు మరియు చికెన్‌తో సహా దేశీయ పక్షుల మాంసం, గుడ్లు వినియోగం మరియు వ్యాపారం చేయడంపై అలప్పుజ జిల్లా కలెక్టర్ నిషేధం విధించారు.

అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో కంట్రోల్ రూములు తెరవాలని నిర్ణయం

అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో కంట్రోల్ రూములు తెరవాలని నిర్ణయం

వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

బాధిత ప్రాంతాల 10 కిలోమీటర్ల వ్యాసార్థాన్ని సందర్శించే వలస పక్షులను రాష్ట్ర అటవీ శాఖ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి కె.రాజు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం పరిస్థితిని అంచనా వేసి, అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో కంట్రోల్ రూములు తెరవాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు మనుషులకు సోకలేదన్న అధికారులు

ఇప్పటి వరకు మనుషులకు సోకలేదన్న అధికారులు

వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి జంతువుల నుండి మనుషులకు సోకలేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా విలవిలలాడుతున్న కేరళ వాసులు ఇప్పుడు బర్డ్ ఫ్లూ భయంతో బిక్కుబిక్కుమంటున్నారు .

English summary
Bird flu cases were reported from some parts of Kottayam and Alappuzha districts, and the government has ordered killing of ducks, hens and other domestic birds.The Kerala government has declared avian influenza, also known as bird flu, a state disaster. The Kerala government has issued a high alert in Kottayam and Alappuzha districts following the outbreak of bird flu cases. Authorities have issued a high alert in the state, considering the potential for the spread of the bird flu virus to humans, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X