వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus : హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన కేరళ ప్రభుత్వం...

|
Google Oneindia TeluguNews

కేరళలో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. ఆ రాష్ట్రం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన చర్యలను తీసుకునేందుకే విపత్తుగా ప్రకటించామని ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు. ఇప్పటివరకు కేరళ నుంచి 146 మంది బ్లడ్ శాంపిల్స్‌ను పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించగా..అందులో మూడు కేసులు పాజిటివ్‌గా తేలాయి. 46 కేసులు నెగటివ్‌గా తేలాయి. మిగతా శాంపిల్స్ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలిన కేసుల్లోని వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్న 80మంది వ్యక్తులను వైద్య పర్యవేక్షణలో ఉంచారు.

కేరళలో మూడు కేసులు

కేరళలో మూడు కేసులు

కేరళలో మొదటి కరోనా వైరస్ కేసు త్రిసూర్ జిల్లాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజులకే చైనా నుంచి తిరిగొచ్చిన అలప్పుజాకు చెందిన వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. తాజాగా మూడో కేసు కూడా నిర్దారణ కావడంతో కేరళ ప్రభుత్వం అప్రతమత్తమైంది. ప్రస్తుతం 2వేల మందిని వారి వారి ఇళ్లల్లోనే ప్రభుత్వం వైద్య పర్యవేక్షణలో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 70మంది ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

 ఐసోలేషన్ వార్డుల్లో...

ఐసోలేషన్ వార్డుల్లో...


చైనాలోని భారతీయుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో వెనక్కి రప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 300 పైచిలుకు మందిని వెనక్కి రప్పించింది. వీరందరికి ఢిల్లీ విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి.. అక్కడి నుంచి నేరుగా మానేసర్‌లోని ఐసోలేషన్ వార్డులకు తరలించింది. 14 రోజుల వరకు వీరంతా అక్కడే ఉండనున్నారు. కరోనా నెగటివ్ అని తేలిన తర్వాత వీరిని అక్కడినుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తారు.

 చైనాలో విషమిస్తోన్న పరిస్థితి..

చైనాలో విషమిస్తోన్న పరిస్థితి..

కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు దాదాపు 361 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా సోకినవారి సంఖ్య 17238కి పెరిగింది.కొత్తగా మరో 2829మందికి వైరస్ సోకినట్టుగా నిర్దారించారు. చైనా వెలుపల ఫిలీప్పీన్స్‌లో మొదటి కరోనా మృతి కేసు చోటు చేసుకుంది. ఇప్పటికే పలు దేశాలకు కరోనా విస్తరించడంతో.. ఆయా దేశాల్లో దాదాపు 150 కేసులు నమోదయ్యాయి.

ప్రయాణ ఆంక్షలు..

ప్రయాణ ఆంక్షలు..

చైనాకు ప్రయాణించే భారతీయ పౌరులకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. చైనాకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ట్రావెల్ అడ్వైజరీ సూచించింది. చైనా నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఐసోలేషన్ వార్డులకు వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా, చైనా పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.

English summary
The Kerala government has declared the lethal disease caused by the Novel Coronavirus as a "state calamity" after three people from the southern state tested positive for the virus, which originated from China's populated Wuhan city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X