వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్వాసనాళంలో విజిల్... 20 ఏళ్లుగా... ఎట్టకేలకు సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు...

|
Google Oneindia TeluguNews

కేరళకు చెందిన ఓ మహిళ గత 20 ఏళ్ల నుంచి దగ్గు సమస్యతో బాధపడుతోంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఎన్ని మందులు వాడినా ఆమెకు దగ్గు నయం కాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను ఆమె సంప్రదించింది. వైద్య పరీక్షల్లో ఆమె శ్వాస నాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయినట్లు తేలింది. దగ్గు సమస్యకు ఇదే అసలు కారణమని గుర్తించిన వైద్యులు... శస్త్ర చికిత్స ద్వారా దాన్ని తొలగించారు.

వివరాల్లోకి వెళ్తే... కన్నూరు జిల్లా మట్టన్నూర్‌కు చెందిన ఓ మహిళ(45) 25 ఏళ్ల వయసులో అనుకోకుండా విజిల్‌ను మింగేసింది. విజిల్ మింగిన విషయం ఆమె కూడా గుర్తించలేకపోయింది. అప్పటినుంచి ఆమె శ్వాసకోశ సమస్య,దగ్గుతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. బహువా అస్తమా వల్లే ఈ సమస్య వస్తోందని ఆమె భావించారు.

Kerala Doctors Remove Whistle Stuck In Womans Respiratory System For 20 Years

ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె కన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడ డా.రాజీవ్ రామ్ నేత్రుత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె శ్వాస నాళంలో చిన్నపాటి విజిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. శ్వాసనాళానికి అది అడ్డుగా ఉండటంతో ఆమె శ్వాసకోశ,దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు నిర్దారించారు.దీంతో ఆమె గొంతుకు శస్త్ర చికిత్స చేసి ఎట్టకేలకు విజిల్‌ను తొలగించారు. గత 20 ఏళ్లుగా ఆ విజిల్ కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆమెకు ఇప్పుడు ఉపశమనం లభించినట్లయింది.

ఇటీవల యూకెలో ఓ 12 ఏళ్ల బాలుడు 54 అయస్కాంతాలను మింగిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. సర్జరీ ద్వారా బాలుడి కడుపులోని ఆ అయస్కాంతాలను తొలగించి వైద్యులు అతని ప్రాణాలు కాపాడారు. అయస్కాంతం మింగితే తన శరీరం కూడా మ్యాగ్నెట్‌లా మారి ఇనుప వస్తువులను ఆకర్షిస్తుందా అన్నది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆ బాలుడు ఇలా తనపై తానే ప్రయోగం చేసుకున్నాడు. చివరకు ఆ అయస్కాంతాలు బయటకు రాకపోవడంతో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు సర్జరీ ద్వారా వాటిని తొలగించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

English summary
Doctors at the government medical college in Kerala's Kannur have removed a tiny whistle from the respiratory system of a 40-year-old woman who had accidentally swallowed it in her teenage and was bothered by a racking cough for over two decades
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X