వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంత్యక్రియలకు ముందు: కొడుకు మృతదేహం కోసం చూశారు... శవపేటిక తెరవగానే షాకయ్యారు

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలో ఓ కుటుంబం షాక్‌కు గురైంది. సౌదీ అరేబియాలో మృతి చెందిన తన కుమారుడి మృత దేహం కోసం ఎదురు చూశారు ఆ కుటంబ సభ్యులు. అయితే విమానాశ్రయం నుంచి మృతదేహం ఉన్న శవపేటిక ఇంటికి చేరుకుంది. ఇక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారి ఆ శవపేటికను తెరిచి చూడగా కుటుంబ సభ్యులు అంతా షాక్‌ గురయ్యారు. కాఫిన్‌లో ఉన్నది తన కుమారుడి మృతదేహం కాదు... మరో మహిళ మృతదేహం.

మిస్టర్ క్లీన్ సీఎం: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? మిస్టర్ క్లీన్ సీఎం: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

ఇక అసలు విషయానికొస్తే కేరళలో నివాసముంటున్న రఫీక్ ఉద్యోగ రీత్యా సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఫిబ్రవరి 28న రఫీక్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇక అప్పటి నుంచి విషాదంలో మునిగిపోయింది ఆ కుటుంబం. మృతదేహం భారత్‌కు తరలించేందుకు అన్ని లాంఛనాలు పూర్తి చేసి మృతదేహాన్ని శవపేటికలో ఉంచి కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకు తరలించారు. తీరా ఇంటికి చేరుకున్న తర్వాత శవపేటికను తెరిచి చూడగా కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శవపేటికలో ఉన్నది తన కొడుకు మృతదేహం కాదు.. అందులో ఉన్న ది ఒక శ్రీలంకకు చెందిన మహిళ మృతదేహం.

Kerala family awaiting sons mortal remains from Saudi Arabia receives Sri Lankan womans body

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొన్ని సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. విచారణ చేసిన ఇన్స్‌పెక్టర్ సౌదీ అరేబియాలోని ఎయిర్ పోర్టులో కార్గో విమానంలో శవపేటికలను ఎక్కించే సమయంలోనే మారి ఉంటాయని తెలిపారు. అదే సమయంలో శ్రీలంక నుంచి తమకు ఫోన్ వచ్చినట్లు చెప్పారు ఇన్స్‌పెక్టర్. రఫీక్ మృతదేహం శ్రీలంకలో ఉందని కొన్నిలో ఉన్నది బేందర మనేకి అనే మహిళదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మార్చి 20న మహిళ మృతదేహం కొచ్చికి చేరినట్లు చెప్పారు. ఇక మహిళ మృతదేహాన్ని కేరళకు పంపించాలని తాము ఆర్డీఓను కోరినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కొట్టాయం మెడికల్ కాలేజీలో మహిళ మృతదేహాన్ని భద్రపరిచారు.

English summary
An unfortunate mix-up aggravated the miseries of a couple grieving the death of their son in Saudi Arabia when they found that the mortal remains brought from the Gulf nation were that of a Sri Lankan woman.Rafeeq (29), who worked in a firm in Saudi Arabia, died of a heart attack on February 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X