వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య, విజయన్‌కు రాజ్‌నాథ్‌ ఫోన్

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్యకు గురయ్యారు. అయితే ఈ ఘటనపై కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. మరో వైపు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

34 ఏళ్ళ రాజేష్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై బిజెపి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

Kerala: Five taken into custody for RSS worker murder

అయితే రాజేష్‌ను సిపిఎం కార్యకర్తలే హత్య చేశారని బిజెపి ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాతకక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యమంత్రి విజయన్‌కు ఫోన్ చేశారు అయితే ఈ ఘటనకు పాల్పడినవారు ఎవరైనా చర్యలు తీసుకొంటామని హోంమంత్రికి విజయన్‌ సమాధానమిచ్చారు. ఈ మేరకు సిఎంఓ తెలిపింది.

మరో వైపు ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న ఐదుగురు సిపిఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.

English summary
Five persons have been taken into custody in connection with the killing of an RSS worker here even as the BJP called for a dawn-to-dusk state- wide hartal on Sunday to protest the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X