వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో వరద బీభత్సం: సాయం చేద్దాం.. వారు ఒంటరి కాదని నిరూపిద్దాం!

Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ నష్టం సంభవించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలను వరదలు అతలాకుతలం చేశాయి. ఎన్నో జిల్లాలు, ఎన్నో ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు 19,500 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రకటించారు.

దాదాపు వంద ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ ఇంతటి భారీ వరదలను చూసింది. వేలాది మంది ప్రజలు తిండి లేక విద్యుత్ లేక వరదల్లో చిక్కుకుపోయారు. వరద కారణంగా ఎన్నో ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది. కొన్నిచోట్ల ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చాయి. వరదలు కొనసాగుతోన్నందున పలు ప్రాంతాల్లో నీరు ఇంకా ఇంకా పెరుగుతోందని స్థానిక ప్రజాప్రతినిధి అబ్రహమ్ చెప్పారు.

Kerala Flood: What’s Been Happening And How You Can Help

పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీంతో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. కేరళకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.500 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలాగే మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ఇస్తారు.

సమాచారం మేరకు దాదాపు 1.3 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ వరదల కారణంగా దాదాపు 300 మంది చనిపోయారు. ఇడుక్కి, మలప్పురం తదితర ప్రాంతాల్లో దాదాపు 2వేలకు పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆగస్ట్ 26వ తేదీ వరకు కొచ్చి విమానాశ్రయాన్ని మూసేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35కు పైగా గేట్లను ఎత్తివేశారు.

Kerala Flood: What’s Been Happening And How You Can Help

ఎంతోమంది బాధితులు సహాయం కోసం ఇంటర్నెట్ ద్వారా విజ్ఞప్తులు చేశారు. చెంగన్నూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దాదాపు మెడలోతు వరకు నీరు ఇంట్లోకి వచ్చింది. అలపుజాకు చెందిన మరో వ్యక్తి మరో తమకు ఆహారం, కరెంట్ లేదని, సెల్ ఫోన్లు అందుబాటులో లేవని మరో వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇదీ వైరల్ అవుతోంది.

కేరళ విషాదానికి ఇవి ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే. వేలాది మంది ఇళ్లు, తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి విపత్తులు ఎక్కడ, ఎప్పుడు సంభవించినా నష్టాన్ని అంచనా వేసేందుకు కొంత సమయం పడుతుంది. కేరళలో వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మన సహాయం అవసరం. కాబట్టి మనం ఏం చేయగలమో అది చేద్దాం. చిన్న సహాయం కూడా పెద్ద సహాయం కావొచ్చు. చిన్న చిన్న బింధువులు కలిస్తే సముద్రం అయినట్లు మన సహకారం వారికి ఉపయోగపడుతుంది.

Kerala Flood: What’s Been Happening And How You Can Help

మీరు సహాయం చేయాలనుకుంటే, చీఫ్ మినిస్టర్స్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (గవర్నమెంట్ ఆఫ్ కేరళ)కు ఆన్‌లైన్ ద్వారా ఇలా పంపించవచ్చు.

ఆన్ లైన్ డొనేషన్స్ మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా సహాయం చేయవచ్చు..

- మీరు నిత్యావసర వస్తువులను పంపించవచ్చు. దుస్తులు, ఆహార పదార్థాలు, శానిటరీ నాప్కిన్స్, వంట పాత్రలు, పడుకునేందుకు అవసరమైన వస్తువులు, టాయిలెట్ల తదితరాలు ఇలా పంపించవచ్చు.

అమెజాన్ కేరళ రిలీఫ్ కంపెయిన్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మీరు ఇలా సహాయం చేయవచ్చు.

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ పర్సన్ ఫైండర్ (వ్యక్తిని గుర్తించేందుకు) టూల్‌ను లాంచ్ చేసింది. దీని ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను గుర్తించవచ్చు. సహాయం కోసం మీరు ఇక్కడ క్లిక్ చేయవచ్చు

ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన హెల్ప్‌లైన్ నెంబర్లు

Kasargod 9446601700
Kannur 91-944-668-2300
Kozhikode 91-944-653-8900
Wayanad 91-807-840-9770
Malappuram 91-938-346-3212
Malappuram 91-938-346-4212
Thrissur 91-944-707-4424
Thrissur 91-487-236-3424
Palakkad 91-830-180-3282
Ernakulam 91-790-220-0400
Ernakulam 91-790-220-0300
Alappuzha 91-477-223-8630
Alappuzha 91-949-500-3630
Alappuzha 91-949-500-3640
Idukki 91-906-156-6111
Idukki 91-938-346-3036
Kottayam 91-944-656-2236
Kottayam 91-944-656-2236
Pathanamthitta 91-807-880-8915
Kollam 91-944-767-7800
Thiruvananthapuram 91-949-771-1281

కేరళ ప్రజలకు మన సహకారం అవసరం. వారికి సహాయం చేసేందుకు ముందుకు వద్దాం. వారిని ఆదుకోవడం ద్వారా కేరళీయులు ఒంటరి కాదని చెబుదాం. మనమంతా కలిసి మానవత్వాన్ని కాపాడుదాం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X