వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్, స్వామిజీ మర్మాంగం కోసిన కేసులో మరో మలుపు: బాలికకు 'పాలీగ్రాఫ్' పరీక్ష..

కేసు తప్పుదోవ పడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో..యువతిని 'పాలీగ్రాఫ్' పరీక్షకు పంపించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కోర్టు(పోస్కో) ఆదేశాలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని ఓ ఆశ్రమంలో స్వామిజీ గణేశానంద(54) ఓ యువతి(23)పై అత్యాచారానికి పాల్పడిన ఘటన మరో మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.తొలుత స్వామిజీయే తనపై అత్యాచారం చేశాడని, ప్రతిఘటించే క్రమంలో అతని మర్మాంగం కోసేశానని చెప్పిన బాలిక.. ఆ తర్వాత మాట మార్చడంతో కథ అడ్డం తిరిగింది.

స్వామిజీ తనకు తండ్రి లాంటి వాడని యువతి చెబుతున్న మాటలు.. విన్నవాళ్లందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. అటు స్వామిజీ సైతం తన మర్మాంగాన్ని తానే కోసేసుకున్నానని, ఎలాంటి ఉపయోగం లేనందువల్లే ఇలాంటి చర్యకు పాల్పడ్డానని చెప్పుకురావడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.

<strong>స్వామిజీ 'రేప్' కేసులో కొత్త కథ: మర్మాంగం కోయలేదన్న యువతి.. బెదిరింపులే కారణమా?</strong>స్వామిజీ 'రేప్' కేసులో కొత్త కథ: మర్మాంగం కోయలేదన్న యువతి.. బెదిరింపులే కారణమా?

Kerala godman claims self genital mutilation; victim to undergo polygraph test

కేసు తప్పుదోవ పడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో..యువతిని 'పాలీగ్రాఫ్' పరీక్షకు పంపించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కోర్టు(పోస్కో) ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్ష ద్వారా బాలిక చెబుతున్న విషయాల్లో నిజమెంత? అనేది తేలనుంది. మరోవైపు కేసును నీరుగార్చడానికి యువతి చేత అబద్దాలు చెప్పేలా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు స్వామిజీపై ఉన్నాయి.

కాగా, కేరళ ప్రభుత్వం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతిపై అత్యాచారం కేసులో ప్రస్తుతం స్వామిజీపై సెక్షన్376(రేప్ )ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ కింద నమోదైన కేసులు కొనసాగుతున్నాయి.

English summary
The Trivandrum Protection of Children from Sexual Offenses Act (POCSO) court on Tuesday dismissed the bail application of godman Ganeshananda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X