వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వప్న సురేశ్‌కు మెంటల్ టార్చర్ అట.. ఎన్ఐఏ కోర్టులో లాయర్, మరో 28 రోజులు జ్యుడిషీయల్ కస్టడీ

|
Google Oneindia TeluguNews

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్ అండ్ కోకు కస్టడీ గడువును ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పొడిగించింది. స్వప్న సురేశ్, శరిత్, సందీప్ నాయర్‌కు కోర్టు మరో 28 రోజుల జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. అయిsతే స్వప్న సురేశ్ తరఫు న్యాయవాది మాత్రం కస్టడీలో తన క్లయింట్‌ను మానసికంగా వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తసీుకొచ్చారు. స్టేట్ మెంట్ రికార్డు చేస్తామని చెప్పి వేధిస్తున్నారని పేర్కొన్నగా.. స్వప్న సురేశ్, సందీప్ బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ 5వ తేదీన విచారిస్తామని పేర్కొన్నది.

గురువారం స్వప్న సురేశ్, సందీప్ నాయర్‌ను ఎన్ఐఏ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. వీరి కస్టడీ శుక్రవారం ముగియనుండటంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. బంగారం అక్రమ రవాణా కేసులో మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్‌ను గురువారం ఎన్ఐఏ అధికారులు విచారించారు. స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడంలో శివశంకర్ కీ రోల్ పోషించారు. బంగారం అక్రమ రవాణ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే.. అతనిని సీఎం పినరయి విజయన్ తప్పించిన సంగతి తెలిసిందే.

Kerala gold smuggling Accused sent to judicial custody for 28 days..

Recommended Video

#JusticeforJayarajAndFenix : మనుషుల్లో మానవత్వం ఉందా ? Jayaraj & Fenix ఘటనపై సినీ తారలు నిరసన!

బంగారం అక్రమ రవాణ కేసులో ఈడీ కూడా కేసు నమోదు చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా కేసును కేంద్రం ఎన్ఐఏకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్ల ఈ బంగారం విలువ రూ.14.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

English summary
special court in Kochi extended the custody of the three accused in the Kerala gold smuggling case on Friday, namely Swapna Suresh, Sarith PS and Sandeep Nair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X