బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వప్న సురేశ్ అరెస్ట్: బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ..

|
Google Oneindia TeluguNews

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో శనివారం అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆమె కుటుంసభ్యుల కూడా ఉన్నారని.. ఆదివారం ఉదయం కోచి ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తామని తెలిపారు. బంగారం స్మగ్లింగ్‌లో మరో నిందితుడు సందీప్ నాయర్‌ను కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. 30 కిలోల బంగారం అక్రమ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్ పాత్ర స్పష్టమయ్యింది. అయితే ఆమె కర్ణాటక ఐటీ శాఖలో కీలక కొలువులో ఉండటం, సీఎంవో కార్యాలయ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

 Kerala Gold Smuggling Case Accused Swapna Suresh Arrested..

పినరయి విజయన్ లక్ష్యంగా విపక్షాలు ప్రతిపక్షాలు విమర్శలు చేయడంతో సీఎం స్పందించారు. బంగారం స్మగ్లింగ్‌పై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాలని బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీంతో కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించింది. శుక్రవారం రంగంలోకి దిగిన ఎన్ఐఏ కూపీ లాగారు. 24 గంటలు గడవకముందే స్వప్న సురేశ్‌ను అరెస్ట్ చేశారు.

Recommended Video

Complete Lockdown From July 14-22 బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో లాక్ డౌన్ || Oneindia Telugu

బంగారం అక్రమ రవాణా అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది అని భావించింది. దీంతో కేసు విచారణకు ఎన్ఐఏకు అప్పగించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేశ్ సహా సురేశ్ శరిత్, సందీప్ నాయర్ తిరువనంతపురం కాగా.. ఎర్నాకులానికి చెందిన ఫజీల్ ఫరీద్ కూడా భాగస్వామ్యం ఉంది అని అధికారులు భావిస్తున్నారు.

English summary
Swapna Suresh, the second accused in the Kerala gold smuggling case, was arrested from Bengaluru on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X