వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్‌లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..

|
Google Oneindia TeluguNews

ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్లొమాటిక్ బ్యాగేజీల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేసిన తర్వాత దానికి సంబంధించిన డబ్బును హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి మార్పిడి అయ్యేదని దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు వెల్లడైంది.

Recommended Video

IAS Officer Submits Fake OBC Certificate | చిక్కుల్లో Kerala IAS || Oneindia Telugu

దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.దేశంలో తొలిసారి.. జగన్ ప్రతిష్ట రెట్టింపు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవిష్కణకు కేంద్రం ఫండింగ్.

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులు, ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న స్వప్న సురేష్ , సందీప్ నాయర్ లు చెప్పిన విషయాలను బట్టి.. గోల్డ్ సరఫరా తర్వాత నగదు చెల్లింపులు హైదారాబాద్ లో జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. హవాలా డబ్బు ను హైదరాబాద్ నుంచి దుబాయ్ కి తరలించినట్లు ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం.

Kerala Gold Smuggling Case: customs suspects hawala links in Hyderabad

ఈనెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో.. యూఏఈ నుంచి వచ్చిన డిప్లొమాటిక్ బ్యాగేజీలో రూ.15 కోట్లు విలువచేసే 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు స్వప్న సురేశ్.. కేరళ ఐటీ శాఖలో కీలక ఉద్యోగిని కావడం, ఆ శాఖను సీఎం పినరయి విజయన్ నిర్వహిస్తుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ కలకలం రేపింది. విజయన్ రాజీనామాకు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సీఎం అభ్యర్థన మేరకు ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది.

Kerala Gold Smuggling Case: customs suspects hawala links in Hyderabad

అరెస్టయిన నిందితులు, అదుపులోకి తీసుకున్న అనుమానితులు చెప్పిన వివరాల ప్రకారం.. గతేడాది జులై నుంచి ఈ ఏడాది జులై 5న వ్యవహారం గుట్టు రట్టయ్యే సమయానికి భారీగా బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు తేలింది. ఏడాది గ్యాప్ లో వివిధ సందర్భాల్లో మొత్తం 230 కేజీల గోల్డ్ ను స్మగ్లింగ్ చేశారని, ఒక్కోసారి బ్యాగేజీ బరువు 70 కేజీల దాకా ఉండేదని వెల్లడైంది. విదేశాల నుంచి బంగారం అక్రమరవాణా.. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేది కావడంతో దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం తెలిసిందే.

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధజగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

English summary
In the gold smuggling case in Kerala, which has caused ripples across the country, shocking details have now emerged. According to latest information, the customs officials have found out that the case also has links to Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X