Gold Smuggling: స్వప్న ఎఫెక్ట్, టాప్ ఐఏఎస్ అరెస్టు, సారీ సార్, మీ స్టోరీ ఇదే, కిలాడీతో లింక్, పాపం !
కొచ్చి/ న్యూఢిల్లీ/ బెంగళూరు: దేశవ్యాప్తంగా కుదిపేసిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినిమా చూపించారు. విచారణ కోసం ఆఫీసుకు పిలిపించిన ఈడీ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు శివశంకర్ ను విచారణ చేసి చివరికి అరెస్టు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్, కిలాడీ ఆంటీ స్వప్న సురేష్ దెబ్బకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కటకటాలపాలైనారని ప్రముఖ జాతీయ టీవీ చానల్ కథనం ప్రచురించింది. సారీ సార్... మీ స్టోరీ ఇదే, కిలాడీ లేడీతో మీకు లింక్ ఏమిటి సార్ అంటూ ఈడీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిసింది.
CCTV: మేడమ్ ఒక్కసారి అంటూ నడిరోడ్డులో నలిపేశాడు, ఖర్మకాలిపోయింది, ఏదో అనుకుంటే, వాడేవీడు!

సార్...... ఒక్కసారి వస్తారా !
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్ స్వప్న సురేష్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు సహకరించారని ఆరోపణలు రావడంతో ఈడీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం కొచ్చిలోని వారి కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు.

సారీ.... మీ టైమ్ బాగాలేదు
బుధవారం ఉదయం సొంతకారులో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కొచ్చిలోని ఈడీ అధికారుల కార్యాలయానికి వెళ్లారు. విచారణ కోసం ఆఫీసుకు పిలిపించిన ఈడీ అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు శివశంకర్ ను విచారణ చేసి చివరికి ఆయన్ను అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోసం శివశంకర్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే శివశంకర్ కు బెయిల్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసు కింగ్ పిన్, కిలాడీ స్వప్న సురేష్ దెబ్బకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ కటకటాలపాలైనారని ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే టీవీ మొదటి సారి వార్తలు ప్రసారం చేసింది.

సార్ చేసిన మొదటి తప్పు !
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ముందు నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు తెలిసినా ఆ విషయం బయటకు రాకుండా అధికారం దుర్వినియోగం చేశారని విచారణ చేస్తున్న అధికారులు ఆరోపిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని నిందితులతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేసి ఆయన్ను మూడుసార్లు విచారణ చేశారు.

స్వప్నా మేడమ్ ఫ్యామిలీ ప్యాకేజ్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న స్వప్న సురేష్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో కేరళ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే అనేకసార్లు స్వప్న సురేష్ కు ఐఏఎస్ అధికారి శివశంకర్ ఆర్థిక సహాయం చేశారని, ఆమెను అన్నిరకాలుగా ఆదుకున్నారని అధికారులు విచారణలో వెలుగు చూసింది.

కేరళలో దూమరం
కేరళ అధికార పార్టీ నేతలతో స్వప్న సురేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇదే సమయంలో శివశంకర్ ఆమెకు అండగా నిలిచారని వెలుగు చూడటంతో కలకలం రేపింది. చార్టెడ్ అకౌంటెంట్ వేణుగోపాల్ తో పాటు స్వప్న సురేష్ ఓ జాతీయ బ్యాంకులో జాయింట్ లాకర్లు తెరిచారని అధికారులు గుర్తించారు. స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు పరిశీలించిన అధికారులు అందులో రూ. 1. 50 కోట్ల నగదు, రూ. కోట్లు విలువైన బంగారం ఉన్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేశారు. జాతీయ బ్యాంకులో స్వప్న సురేష్ సీక్రేట్ బ్యాంకు లాకర్లు పెట్టుకోవడానికి ఐఏఎస్ అధికారి శివశంకర్ సహకరించారని ఇప్పటికే అధికారులు కొచ్చిలోని ప్రత్యేక కోర్టుకు ఆధారాలు సమర్పించారు.

ఎన్ఐఏ ఎంట్రీతో సీన్ రివర్స్
ఎన్ఐఏ అధికారులు స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా అక్రమంగా సంపాధించిన డబ్బులు, బంగారాన్ని స్వప్న సురేష్ బ్యాంకు లాకర్లలో దాచిపెట్టారని వెలుగు చూసింది. బ్యాంకులో అక్రమ సంపాధన దాచుకోవడానికి ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యక్తిగత ప్రధాన కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసే సమయంలోనే ఐఏఎస్ అధికారి స్వప్న సురేష్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఒక ఐఏఎస్ అధికారి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న లేడీ కిలాడీతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు ? వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు ? అనే కోణంలో అధికారులు విచారణ చేసి మొత్తం బయటకు లాగడంతో శివశంకర్ కు సినిమా కష్టాలు మొదలైనాయి.

రమ్మన్నారు.... కాని పొమ్మనలేదు
ఐఏఎస్ అధికారి ఎం. శివశంకర్ ను మరింత లోతుగా విచారణ చేసి పూర్తి వివరాలు సేకరించాలని ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ అధికారులు గతంలోనే డిసైడ్ అయ్యి ప్రత్యేక కోర్టులో అనుమతి తీసుకున్నారు. అందులో భాగంగానే బుధవారం ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఈడీ అధికారులు రాత్రి వరకు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఈడీ అధికారులు రెండుసార్లు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐఏఎస్ అధికారి శివశంకర్ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేస్తున్నారు. చివరికి సారీ సార్ మీ కథ మొత్తం తెలిసిపోయింది అంటూ శివశంకర్ ను అరెస్టు చేశారు. మొత్తం మీద మేడమ్ స్వప్న సురేష్ దెబ్బతో ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తుందో ? అనే విషయం వేచిచూడాల్సిందే, ఈ కేసుతో సీఎం పినరయి విజయన్ కు పరోక్షంగా సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ట్వీట్ లు చెయ్యడం కలకలం రేపుతోంది.