వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వప్న సురేశ్ వ్యవహారంలో భారీ ట్విస్ట్.. ప్రధాని మోదీ జోక్యం కోరిన సీఎం.. దేశ ప్రతిష్టకు భంగం..

|
Google Oneindia TeluguNews

స్వప్న సురేశ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. కేరళ ముఖ్యమంత్రి ఇన్ చార్జిగా ఉన్న ఐటీ ప్రాజెక్టులో స్వప్న మేనేజర్ గా పనిచేస్తుండటంతో ఈ నేరంలో సీఎంవో పాత్ర కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేరళలో కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా స్పందించింది.

ప్రధానికి సీఎం లేఖ..

వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. అందులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. ‘‘జులై 5న త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 30 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అది డిప్లొమాటిక్ బ్యాగేజీలో యూఏఈ నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏ కోణంలో చూసినా ఇది చాలా సీరియస్ కేసు అవుతుంది. దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసేదేకాక, దౌత్యపరంగా మన ప్రతిష్టకు భంగం కలిగించే వ్యవహారమిది'' అని సీఎం విజయన్ లేఖలో ప్రస్తావించారు.

ఇదీ స్వప్న సురేశ్ సంచలనాల జాబితా.. కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ వేట.. 10th పాస్ కాకుండానే టాప్‌కు..ఇదీ స్వప్న సురేశ్ సంచలనాల జాబితా.. కస్టమ్స్, సీబీఐ, ఎన్ఐఏ వేట.. 10th పాస్ కాకుండానే టాప్‌కు..

సమగ్ర దర్యాప్తుకు సహకారం..

సమగ్ర దర్యాప్తుకు సహకారం..

గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఇప్పటికే కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ, కేసుకు ఉన్న ప్రాధాన్యం రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే కలుగజేసుకోవాలని, దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని సీఎం విజయన్ కోరారు. కేంద్రం తీసుకోబోయే ఎలాంటి నిర్ణయానికైనా కేరళ ప్రభుత్వం నూటికినూరు శాతం సహకరిస్తుందని, వీలైనంత తొందరగా దీనిపై దృష్టి సారించాలని లేఖలో పేర్కొన్నారు.

స్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారంస్వప్న సురేష్.. సెన్సేషనల్ క్రైమ్.. సీఎం మెడకు స్మగ్లింగ్ వ్యవహారం.. టాప్ ఐఏఎస్ ఔట్.. పెనుదుమారం

ప్రతిపక్ష నేతలపై ఫైర్..

ప్రతిపక్ష నేతలపై ఫైర్..

అంతకుముందు, కేరళ ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారి స్వప్న సురేశ్ కు సీఎం విజయన్ తో నేరుగా సంబంధాలు ఉన్నాయని, ఆమెను కాపాడేందుకు సీఎంవో అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ కేసును రాష్ట్ర పరిధి నుంచి తప్పించి సీబీఐతో దర్యాప్తు చేయించాల్సిందిగా ప్రధానిని కోరారు. ప్రతిపక్ష నేతల ఆరోపణలపై మండిపడ్డ సీఎం.. ‘‘ఎయిర్ పోర్టులు, కస్టమ్స్ విభాగం కేంద్రం పరిధిలోనే ఉంటుందన్న కనీస జ్ఞానం కూడా లేకుంటే ఎలా?'' అని ఎదురుప్రశ్నించారు. సరైన క్వాలిఫికేషన్ లేకున్నా, స్వప్నను ఐటీ శాఖలో చేర్చుకున్నారనే ఆరోపణలపై ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పై బదిలీ వేటు పడింది.

English summary
As Kerala Chief Minister Pinarayi Vijayan came under fire in the gold smuggling case involving the former PRO of the UAE consulate and Swapana Suresh, now, Vijayan has asked PM Narendra Modi to intervene in the matter immediately and said that the case undermines the ecountry's conomy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X