వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold smuggling: సినిమా చూపించిన ఎన్ఐఏ, కోర్టులో చార్జ్ షీట్, విదేశాల్లో తిష్టవేసిన మేధావులు, స్వప్న ఆంటీ!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో NIA అధికారులు మొదటి అడుగువేశారు. బంగారు స్మగ్లింగ్ కేసులో ఆరు నెలల పాటు విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు మొదటిసారి కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్ అలియాస్ స్వప్న ఆంటీతో పాటు మొత్తం 30 మందికి పైగా పేర్లు నమోదు కావడం కలకలం రేపింది.

ఇప్పటికే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో 21 మంది అరెస్టు అయ్యారు. మిగిలిన నిందితులైన మేధావులు విదేశాల్లో తలదాచుకోవడంతో వారిని భారత్ రప్పించి అరెస్టు చెయ్యాలని అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Illegal affair: నాకొడుకు చాలాడా, రంకు మొగుడు కావాలా ? అత్త పాము, కోడలు ముంగీసా, అంతే క్లీన్ బౌల్డ్!Illegal affair: నాకొడుకు చాలాడా, రంకు మొగుడు కావాలా ? అత్త పాము, కోడలు ముంగీసా, అంతే క్లీన్ బౌల్డ్!

ఎయిర్ పోర్టులో ఏం జరిగిందంటే?

ఎయిర్ పోర్టులో ఏం జరిగిందంటే?

యూఏఇ నుంచి కేరళలోని తిరువనంతపురం విమానాశ్రాయానికి ఆరు నెలల క్రితం ఓ పార్శిల్ వచ్చింది. విమానాశ్రయంలో పార్శిల్ పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అందులో కేజీల కేజీల బంగారు బిస్కెట్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఇదే కేసులో ఆరు నెలల క్రితం రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

21 మంది అరెస్టు, 12 మందికి బెయిల్

21 మంది అరెస్టు, 12 మందికి బెయిల్

బంగారు స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అలియాస్ స్వప్న మేడమ్, సందీప్ నాయర్, సరిత్, కెటి రమీజ్, సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ తో పాటు మొత్తం 21 మంది అరెస్టు అయ్యారు. ఆరు నెలల నుంచి కేసు విచారణ జరుగుతోంది. అరెస్టు అయిన వారిలో ప్రస్తుతం 12 మంది బెయిల్ పై విడుదల అయ్యారు. మిగిలిన నిందితులు అందరూ జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు.

క్షమాపణా సాక్షిగా మారింది ఎవరంటే?

క్షమాపణా సాక్షిగా మారింది ఎవరంటే?

దేశవ్యాప్తంగా కలకలం రేపిన బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన (ఈ కేసులో రెండో నిందితుడు) సందీప్ నాయర్ క్షమాపణ సాక్షిగా మారిపోయి తెర మీదకు వచ్చాడు. సందీప్ నాయర్ ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారు. ఈ కేసు విచారణ చేసిన డీఎస్పీ రాధాకృష్ణ పిళ్లై కొచ్చిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఆరు నెలల కాలంలో మొదటిసారి చార్జిషీటు దాఖలు చేశారు.

విదేశాల్లో తిష్ట వేసిన మేధావులు

విదేశాల్లో తిష్ట వేసిన మేధావులు

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొత్తం 30 మందికి పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 21 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. కేరళలోని మువాట్టుపుళాకు చెందిన రాబిన్సన్ ను విదేశాల నుంచి రప్పించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మిగిలిన నిందితులు అందరూ ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్నారని అధికారులు గుర్తించారు. విదేశాల్లో తలదాచుకున్న నిందితులను భారతదేశానికి రప్పించి అరెస్టు చెయ్యడానికి అధికారులు సిద్దం అయ్యారు.

సీఎంకే తడిసిపోయింది

సీఎంకే తడిసిపోయింది

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అరెస్టు కావడం, కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్. శివశంకర్ కూడా ఇదే కేసులో అరెస్టు కావడంతో ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. వెంటనే సీఎం పినరయి విజయన్ ఆయన పదవికి రాజీనామా చేసి కేసు విచారణకు సహకరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చెయ్యడంతో కేరళ ప్రభుత్వం హడలిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ ను సస్పెండ్ చేసిన సీఎం పినరయి విజయన్ తరువాత ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Kerala gold smuggling : NIA filed First chargesheet in gold smuggling case in Kerala NIA court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X