వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతృ బాష ఎఫెక్ట్: విద్యాసంస్థల్లో మలయాళం తప్పని సరి: లేదంటే క్లోజ్ !

కేరళలో ప్రభుత్వానికి చెందిన అన్ని పాఠశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తో సహ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యాసంస్థల్లో ఇంటర్ వరకు కచ్చితంగా మలయాళం బాషను బోధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళ

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ముందు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలో మాతృ బాష (మలయాళం) కచ్చితంగా బోధించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కేరళ ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్ 11) ఆర్డినెన్స్ జారీ చేసింది.

కేరళ ప్రభుత్వ మంత్రి వర్గ సమావేశంలో ఈ విషయంపై క్షుణ్ణంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ విద్యాసంస్థలో ప్రతి విద్యార్థికి మాతృ బాష బోధించాలని ఆదేశాలు జారీ చేశారు. మే నుంచి (2017-18 విద్యాసంవత్సరం) ఈ ఆదేశాలు పాటించాలని సూచించారు.

Kerala Government has promulgated an Ordinance to make teaching of Malayalam mandatory in all schools in the State.

కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని పాఠశాలలు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తో సహ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యాసంస్థల్లో కచ్చితంగా మలయాళం బాషను బోధించాలని ఆదేశించారు. నియమాలు ఉల్లంఘించిన విద్యాసంస్థల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేరళలోని అన్ని విద్యాసంస్థల్లో ఇంటర్ (ఫ్లస్ టూ) వరకు కచ్చితంగా మలయాళం ఓ సబ్జెక్టుగా ఉండాలని సూచించారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మలయాళ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కేరళ బాటలోనే తమిళనాడులో కచ్చితంగా తమిళ బాషను నేర్చించాలని పోరాటం చెయ్యాలని ఇదే రోజు పలు తమిళ సంఘాలు పిలుపునిచ్చాయి.

English summary
Kerala Government has promulgated an Ordinance to make teaching of Malayalam mandatory in all schools in the State. The ordinance will be applicable to all government, aided, unaided, self-financing educational institutions, CBSE and ICSE syllabus schools up to higher secondary level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X