వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్.. స్వైన్ ఫ్లూ ప్రబలే అవకాశం ఉంది.. అప్రమత్తంగా ఉండాలన్న కేరళ అధికారులు

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం : దేవభూమి కేరళలో వర్షం సృష్టించిన బీభత్సంతో విలవిలలాడిపోతోంది. వరదనీటితో ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరిపోయంది. కొన్ని ఇళ్లు అయితే కుప్పకూలిపోయాయి కూడా. కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో చనిపోయారు. అయితే వర్షం తర్వాత వరదనీటితో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. జ్వరాలతో పాటు స్వైన్ ఫ్లూ కూడా విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలిస్తున్నారు.

వర్షాల తర్వాత వాతావరణం చల్లగా ఉండటంతో స్వైన్ ప్లూ మహమ్మరి ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. ఆ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సులువుగా వచ్చే అవకాశం ఉండటంతో అప్రమత్తతకు మించిన ఆయుధం లేదని వైద్యులు చెప్తున్నారు. వర్షాలతో వచ్చిన వరదలు .. వరదనీటితో దోమలు, కీటకాలతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కవే ఉంటాయి. ఎక్కడైనా ఒకరికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే .. మిగతావారు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు.

Kerala health officials urge caution against swine flu after floods

స్వైన్ ఫ్లూ .. హెచ్1 ఎన్ 1 అనే వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ముఖ్యంగా పందుల నుంచి వ్యాప్తి చెందుతుందని వైద్యులు గుర్తించారు. వాటి ద్వారా మనుషులకు వ్యాప్తించి .. ప్రాణం మీదికి తీసుకొస్తుంది. 2009లో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క భారత్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. దానికి అప్పటికప్పుడు టీకాలను కనుగొన్నారు. స్వైన్ ఫ్లూ వచ్చిన వారికి ఎక్కువగా జ్వరం ఉంటుంది. దక్కు, జలుబు, జ్వరం, గొంతులో నొప్పి, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలు కనిస్తాయి. ముఖ్యంగా కండరాల నొప్పులతో అల్లాడిపోతారు. స్వైన్ ఫ్లూ వ్యాది వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ... ఏదీ టచ్ చేసినా హ్యాండ్ వాష్ చేసుకోవాలని కోరుతున్నారు.

English summary
As the flood waters recede and the rains abate for now, health officials in Kerala have urged residents to be cautious against swine flu, which is caused by the influenza A virus. Authorities worry that cases which were sporadically seen prior to the heavy rains and floods in the state, may aggravate now that the weather has considerably improved and with several people still in relief camps. “This is not to alarm people, but just general information. People should keep an eye out for any signs of swine flu in themselves and their families so that we can tackle any potential cases before any spread occurs,” states one official from the Directorate of Health Services (DHS) in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X