వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్, నడిరోడ్డుపై మాస్క్ లేకుండా బలాదూర్, రియాద్ రిటర్న్ రచ్చ..(వీడియో)

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితేనే చాలు వణికి పోవాల్సిన పరిస్థితి. అతగాడు విదేశాల నుంచి వచ్చాడు. హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేక స్వేచ్చగా బయట తిరుగుతున్నాడు. కనిపించడంతో పోలీసులు అడిగారు. రియాద్ నుంచి వచ్చానని చెప్పడంతో.. క్వారంటైన్ తరలించే ప్రయత్నం చేసేందుకు పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య కార్యకర్తలు చిన్నపాటి యుద్దమే చేశారు. కేరళ పాతనంతిట్టలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో కూడా వైరలవుతోంది.

భార్యతో గొడవ..

భార్యతో గొడవ..

కేరళకు చెందిన ఓ వ్యక్తి భార్యతో కలిసి రియాద్‌లో ఉండేవారు. అయితే ఇటీవల అతను స్వస్థలం పతనంతిట్టకు వచ్చాడు. కరోనా వైరస్ నేపథ్యంలో కేరళలో నిబంధనలు మరింత కఠినతరం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారిని విధిగా 14 రోజులు క్వారంటైన్ చేస్తున్నారు. అయితే అతను సోమవారం భార్యతో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉండలేక బయటకొచ్చాడు. అదీ కూడా మాస్క్ కూడా పెట్టుకోలేక రావడంతో పోలీసులు అలర్టయ్యారు.

రియాద్ నుంచి వచ్చానని..

రియాద్ నుంచి వచ్చానని..

అతని గురించి ఆరా తీశారు. తొలుత తడబడ్డ.. ఏదో కారణం చెప్పినా.. చివరకు నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రియాద్ నుంచి వచ్చానని చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందజేశారు. అతనిని ప్రభుత్వ క్వారంటైన్ తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అతను పోలీసులు, పీపీఈ మాస్క్ ధరించిన ఆరోగ్య కార్యకర్తలను ముప్పు తిప్పలు పెట్టాడు.

క్వారంటైన్ కంపల్సరీ

క్వారంటైన్ కంపల్సరీ

హోం క్వారంటైన్ నిబంధనలు బ్రేక్ చేస్తే.. ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలి. ప్రభుత్వ క్వారంటైన్‌కు వచ్చేందుకు నిరాకరించాడు. అతనిని తీసుకెళ్లే క్రమంలో ఆరోగ్య కార్యకర్తలను పరుగులు తీయించాడు

స్వల్ప గాయాలు..

అతను తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. పారిపోగా గాయాలు కూడా అయ్యాయి. చివరికి ఆరోగ్య కార్యకర్తలు ఎలాగోలా పట్టుకున్నారు. తర్వాత అతనిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. దీంతో పోలీసులు, జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరోగ్య కార్యకర్తలను మాత్రం ఆ వ్యక్తి ముచ్చెమటలు పట్టించాడు.

English summary
town of Pathanamthitta on Monday witnessed high drama when a 47-year-old Non-Resident Keralite, who had returned from Saudi Arabia, broke quarantine and roamed around on his scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X