
కేరళ హైకోర్టు సంచలనం.. లెస్బినియన్స్ కలిసి జీవించొచ్చు,
కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లెస్బినియన్స్ కలిసి జీవించేందుకు అనుమతి ఇచ్చింది. తమ పేరంట్స్తో కలిసి ఉండని లెస్బినియన్స్.. తమకు తాము కలిసి నివసించొచ్చు అని స్పష్టంచేసింది. ఆదిలా నష్రీన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపి తీర్పును ఇచ్చింది. తనను, తన భాగస్వామి ఫాతిమా నూరాను కుటుంబాలు వేధిస్తున్నాయని పేర్కొంది. ఆరు రోజుల క్రితం నూరాను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారని వివరించింది.
ఫాతిమా నూరా అలువా నుంచి వచ్చిందని.. తనతో కలిసి ఉంటోందని నష్రీన్ తెలిపింది. కానీ విషయం తెలిసి కుటుంబసభ్యులు బెదిరింపులకు దిగారని వివరించింది. మంగళవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపింది. ఫాతిమా నూరాను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్ కూడా కోర్టుకు రావాలని కోరింది. జస్టిస్ వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించింది. మైనార్టీ తీరిన వారు.. ఇష్టపూర్వకంగా కలిసి ఉండొచ్చు అని తెలిపింది. వారిద్దరీ సమస్యను కోర్టు పరిష్కరించింది.

నష్రీన్- ఫాతిమా చిన్నప్పటి నుంచే తెలుసు.. వారిద్దరూ సౌదీ అరేబియాలో ఉండగానే రిలేషన్ షిప్లో ఉన్నారు. కానీ దానిని పేరంట్స్ నిరాకరించారు. వారి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. కలిసి ఉండాలని వారిద్దరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే కిడ్నాప్ వ్యవహారం జరగడంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు.. కలిసి ఉండేందుకు అభ్యంతరం తెలుపలేదు. ఈ కేసు తీర్పు సంచలనంగా మారింది.