వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శబరిమల అయ్యప్ప గర్బగుడి ముందు కేరళ ఐజీపీ కన్నీరు, క్షమించు స్వామి, విధులు!

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో తులామాస పూజల కోసం ఈనెల 17వ తేదీ బధవారం తీసిన ఆలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం అక్టోబర్ 22వ తేదీ సోమవారం సాయంత్రం గర్భగుడిని మూసివేశారు. నవంబర్ నెలలో మళ్లీ అయ్యప్పస్వామి ఆలయాన్ని తీసి భక్తుల దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. శబరిమల అయ్యప్పస్వామి గర్బగుడి ముందు కేరళ పోలీసు ఐజీపీ కన్నీరు పెట్టుకుని తనను క్షమించాలి స్వామి అంటూ వేడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

శబరిమల ప్రవేశించడానికి ప్రయత్నించిన కిస్ ఆఫ్ లవ్ రెహ్నా ఫాతిమా ఎవరు!శబరిమల ప్రవేశించడానికి ప్రయత్నించిన కిస్ ఆఫ్ లవ్ రెహ్నా ఫాతిమా ఎవరు!

మహిళలకు గర్భగుడిలో అయ్యప్పస్వామి దర్శనం కల్పించాలని ఇటీవల సుప్రీం కోర్టు ప్రత్యేక తీర్పు చెప్పింది. ఈ సందర్బంలో అయ్యప్పస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లిన మహిళలను భక్తులు, అయ్యస్వామి ఆలయం అర్చకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

అన్యమతస్తులు

అన్యమతస్తులు

శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిదానంలో స్వామి దర్శనం చేసుకోవడానికి రెహ్నా ఫాతిమా, మేరీ స్వీటీ, కవితా అనే మహిళలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. గట్టిపోలీసు బందోబస్తుతో పంబా నుంచి శబరిమల చేరుకున్నారు. మహిళలు స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే గర్బగుడి మూసివేస్తామని ప్రధాన అర్చకులు హెచ్చరించి భక్తులతో కలిసి ఆందోళనకు దిగారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని సాంప్రధాయాలను మంటకలపడానికి అన్యమతస్తులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

కన్నీరు పెట్టుకున్న ఐజీపీ

కన్నీరు పెట్టుకున్న ఐజీపీ

సోమవారం వేకువ జామున సుమారు 5 గంటల సమయంలో కేరళ ఐజీపీ శ్రీజిత్ సాధారణ దుస్తుల్లో శబరిమల చేరకుని సన్నిదానంలోని గర్బగుడి ముందుకు వెళ్లారు. అయ్యప్పస్వామి విగ్రహం ముందు చేతులు కట్టుకున్న ఐజీపీ శ్రీజిత్ కన్నీరు పెట్టుకున్నారు. నా కారణంగా తప్పు జరిగిందని, తనను క్షమించాలని శ్రీజిత్ స్వామివారిని వేడుకుని విలపించారు. ఆ సమయంలో సాటి పోలీసు అధికారులు, సిబ్బంది, ఆలయం అర్చకులు ఐజీపీ శ్రీజిత్ ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఐదు నిమిషాల తరువాత శ్రీజిత్ అక్కడి నుంచి పక్కకు తప్పుకుని అయ్యప్ప భక్తుల సర్వ దర్శనానికి అవకాశం కల్పించారు. ఐజీపీ శ్రీజిత్ అయ్యప్పస్వామి ముందు కన్నీరు పెట్టుకుంటున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (ఫోటో: యూట్యూబ్)

నేను హిందువు, అయ్యప్ప భక్తుడు

నేను హిందువు, అయ్యప్ప భక్తుడు

నేను హిందువు, అయ్యప్పస్వామి భక్తుడు, తన విధులను తాను నిర్వహిస్తున్నానని, సుప్రీం కోర్టు ఆదేశాలు, కేరళ ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నానని ఐజీపీ శ్రీజిత్ సాటి పోలీసు అధికారులతో అన్నారని తెలిసింది. అంతే కాకుండా శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి బయలుదేరిన రెహ్నా ఫాతిమాతో పాటు మరో ఇద్దరు మహిళల భద్రతా ఏర్పాట్లను స్వయంగా ఐజీపీ శ్రీజిత్ పర్యవేక్షించారు.

ఐజీపీ వార్నింగ్

ఐజీపీ వార్నింగ్

స్వామి దర్శనం చేసుకుని భక్తుల మనోభావాలను కించపరచకుండా చూడటానికి సహకరించాలని రెహ్నా ఫాతిమాతో పాటు మరో ఇద్దరు మహిళలకు ఐజీపీ శ్రీజిత్ గట్టి హెచ్చరికలు జారీ చేశారని తెలిసింది. మతం, జాతి అంటూ పోలీసుల మీద ఎలాంటి దాడులు జరిగినా తాము చూస్తూ సహించమని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఐజీపీ శ్రీజిత్ హెచ్చరించారు. (ఫోటో: యూట్యూబ్)

అబ్రహాం దెబ్బతో లాఠీచార్జ్

అబ్రహాం దెబ్బతో లాఠీచార్జ్


పంబా, శబరిమల దేవాలయం ఆవరణంలో పోలీసులు అయ్యప్ప భక్తుల మీద లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. కేరళలోని మరో ఐజీపీ మనోజ్ అబ్రహాం ఆదేశాల మేరకు అయ్యప్ప భక్తుల మీద లాఠీచార్జ్ జరిగింది అంటూ ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరగుతోంది. ఐజీపీ మనోజ్ అబ్రహాం హిందువు కాదు కాబట్టి లాఠీచార్జ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసి ఉంటారని పలువురు మండిపడుతున్నారు.

బీఎస్ఎన్ఎల్ వార్నింగ్

బీఎస్ఎన్ఎల్ వార్నింగ్

శబరిమల ప్రవేశించి గర్బగుడిలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి విఫలయత్నం చేసిన రెహ్నా ఫాతిమాను ఇప్పటికే ముస్లీం పెద్దలు వారి మతం నుంచి బహిష్కరించారు. ఇలాంటి గొడవలకు కారణం అయ్యే కార్యక్రమాలు మరోసారి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెహ్నా ఫాతిమా ఉద్యోగం చేస్తున్న బీఎస్ఎన్ ఎల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసి ఆమెను బదిలి చేసింది. అయ్యప్పస్వామి దయతోనే తనకు బదిలి అయ్యిందని, తనకు ఎలాంటి బాద లేదని రెహ్నా ఫాతిమా అంటున్నారు.

English summary
A photo of Kerala IGP S. Sreejith, who led the police team during the protest against women’s entry at Sabarimala temple, has gone viral on social media. In the photo, Sreejith, who was dressed in civilian clothes, can be seen praying in front of Lord Ayappa with tears rolling down his cheeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X