వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ లాటరీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన నిరుపేద కూలీ..

|
Google Oneindia TeluguNews

కేరళలోని కన్నూర్‌కి చెందిన ఓ సాధారణ దినసరి కూలీకి రూ.12కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాత్రికే రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. గతంలో రూ.2వేలు,అంతకన్నా కాస్త ఎక్కువ మొత్తంలో లాటరీ మనీ గెలుచుకున్న అతనికి.. ఒక్కసారిగా ఇంత భారీ లాటరీ తగలడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 రెగ్యులర్‌గా లాటరీ టికెట్ కొనే అలవాటు..

రెగ్యులర్‌గా లాటరీ టికెట్ కొనే అలవాటు..

కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన పొరున్నన్ రాజన్‌ (55) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య రజనీ స్థానిక అంగన్‌వాడీలో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తోంది. పొరున్నన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు. పొరున్నన్‌కు రెగ్యులర్‌గా లాటరీ టికెట్ కొనడం అలవాటు. అయితే కూలీ పనులతో వచ్చే డబ్బుతో అటు కుటుంబాన్ని పోషిస్తూ.. పిల్లలను చదివిస్తూ.. లాటరీ టికెట్లు కొనడం అతనికి కష్టమయ్యేది. ఈ క్రమంలో అతను అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.

లాటరీ తగిలిందని తెలిసి షాక్..

లాటరీ తగిలిందని తెలిసి షాక్..

తగులుతుందో.. తగలదో తెలియని లాటరీ కోసం.. పొరున్నన్ ప్రతీసారి ఆశగా టికెట్ కొనేవాడు. అలా గతంలో రూ.2వేలు,అంతకంటే కాస్త ఎక్కువ మొత్తంలో లాటరీ తగిలాయి. ఆ డబ్బులతో అప్పులు తీర్చలేక.. చేసిన డబ్బులు అప్పులకు చాలక.. సతమతమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో కేరళ క్రిస్‌మస్ బంపర్ లాటరీ టికెట్ పొరున్నన్‌కు తగిలింది. రూ.12కోట్లు విలువ చేసే లాటరీ తగిలిందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు.

ఆ డబ్బుతో ఏం చేస్తాడో చెప్పిన పొరున్నన్ రాజన్..

ఆ డబ్బుతో ఏం చేస్తాడో చెప్పిన పొరున్నన్ రాజన్..

లాటరీ తనకే తగిలిందని తెలియగానే.. వెంటనే ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటివ్ బ్యాంకుకి వెళ్లి అధికారులతో మాట్లాడాడు. పన్నులు పోను రూ.7.2కోట్లు వస్తాయని అధికారులు అతనితో చెప్పారు. వచ్చిన డబ్బుతో ఇంటిపై తీసుకున్న రుణం,చేసిన అప్పులను తీర్చేస్తానని పొరున్నన్ చెబుతున్నాడు. అలాగే పిల్లలిద్దరిని బాగా చదివిస్తానని చెబుతున్నాడు. అలాగే గతంలో తనకు సాయం అందించినవారికి కూడా సహాయం చేస్తానని అంటున్నాడు.

 లాటరీ టికెట్ విషయం ఎవరితోనూ చెప్పని పొరున్నన్..

లాటరీ టికెట్ విషయం ఎవరితోనూ చెప్పని పొరున్నన్..

నిజానికి తాను లాటరీ టికెట్ కొన్న విషయం పొరున్నన్ ఎవరితోనూ చెప్పలేదు. లాటరీ టికెట్లకు డబ్బులు తగలేస్తున్నాడని ఇంట్లో వాళ్లు తిడుతుండటంతో.. భార్యకు కూడా విషయం చెప్పలేదు. ఓరోజు బ్యాంకులో రుణం కోసం వెళ్తున్న సమయంలో.. కూతుపరంబ ప్రాంతంలో అనుకోకుండా రూ.300 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. సాధారణ రేటు కంటే ఇది ఎక్కువ కావడంతో.. ఇక ఇంట్లో చెప్పవద్దని ఫిక్స్ అయ్యాడు. అయితే తాను కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలిందని ఇంట్లో చెప్పడంతో వారి ఆనందానికి కూడా అవధుల్లేవు.

English summary
A daily-wager from the tribal community in Kannur district in Kerala has bagged the first prize of Rs 12 crore of the Chrismas-New Year bumper lottery of the Kerala government, the result of which was announced in state capital Thiruvananthapuram on Monday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X