వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: బీజేపీపై మహిళా లెక్చరర్ ఫిర్యాదు..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలోని త్రిసూరుకు చెందిన మహిళా లెక్చరర్ నిశాంత్.. బీజేపీ శ్రేణులు తనను బెదిరిస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కథువా అత్యాచార ఘటనలో న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టినందుకు కొంతమంది బీజేపీ కార్యకర్తలు తనను టార్గెట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలుకథువా రేప్: చిట్టితల్లి హత్యాచారం వెనుక కొన్ని కఠిన నిజాలు

త్రిసూరులోని శ్రీ కేరళ వర్మ కాలేజీలో నిశాంత్ పనిచేస్తున్నారు. బీజేపీ శ్రేణుల బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఆమె పోలీసులకు ఇచ్చారు. అంతకుముందు ఇదే విషయమై కేరళ సీఎం పినరయి విజయన్ కు ఆమె ఓ విజ్ఞప్తి చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె కోరారు.

Kerala lecturer files police complaint after receiving death threats from BJP workers

స్థానిక బీజేపీ నేత ఒకరు తన సెల్ ఫోన్ నంబర్ ను సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారని కూడా నిశాంత్ పేర్కొన్నారు. 'సోషల్ మీడియాలో నాపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు, బెదిరింపులు పెరిగిపోయాయి. టీజీ మోహన్ దాస్ నా నంబర్, చిరునామాతో సహా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాంతో నేను వ్యక్తిగతంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది' అని దీప చెప్పారు.

కాగా, బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ కి టీజీ మోహన్ దాస్ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. తన ఫోటోలను, చిరునామాను సోషల్ మీడియాలో పోస్టు చేసి తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించారని, ఇప్పుడు ఏకంగా చంపుతామని బెదిరిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించానని దీప నిశాంత్ తెలిపారు.

దీప పోలీసులకు ఇచ్చిన స్క్రీన్ షాట్స్ లో ఒక నిందితుడిని బహ్రెయిన్ కి చెందిన రమేశ్ కుమార్ గా గుర్తించారు. 'మాకు ఆమె రక్తం కూడా కావాలి. ఆమె మన సహనాన్ని దెబ్బతీసింది' అంటూ ఏప్రిల్ 28వ తేదీన అతను ఆమె పట్ల బెదిరింపులకు దిగాడు.

English summary
Thrissur-based lecturer Deepa Nishanth has registered a police complaint against death threats she received from BJP functionaries after she shared a Facebook post seeking justice for the Kathua rape victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X