వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kerala: కేరళలో రారాజు ఎవరు, స్థానిక ఎన్నికల కౌంటింగ్, బస్తీమే సవాల్, 2015 రిపీట్ అవుతందా ?, ఎన్డీఏ!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ తిరువనంతపురం: వచ్చే శాసనసభ ఎన్నికలకు దిక్సూచిగా చెప్పుకుంటున్న కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. కేరళలోని సీపీఎం నాయకత్వంలోని ఎల్ డీఎఫ్ అధికార పార్టీలతో పాటు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం భారీ బందోబస్తు మద్య మొదలైయ్యింది. కేరళలో రారాజు ఎవరు ?, అనే విషయాన్ని స్థానిక ఓటర్లు డిసైడ్ చేస్తున్నారు. 2015 ఫలితాలు రిపీట్ అయితే అధికార పార్టీ నాయకులు పండగ చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు.

Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది!Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది!

స్థానిక సంస్థల ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలు

2020 డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కరోనా వైరస్ (COVID-19) కాలంలో కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని అనేక పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. 2015లో కేరళలో జరిగిన ఎన్నికల్లో 77.76 % శాతం పోలింగ్ జరిగింది. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 76% పోలింగ్ మాత్రమే జరిగింది. గతంలో కంటే ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య చాలా తగ్గిందని ఎన్నికల అధికారులు ఇటీవలే చెప్పారు.

విద్యావంతులు... బుధ్దిమంతులు

విద్యావంతులు... బుధ్దిమంతులు

కేరళలో విద్యావంతులు.... బుధ్దిమంతులు ఎక్కువగా ఉన్నా కరోనా వైరస్ భయంతో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెనకడుగు వేశారని స్పష్టంగా వెలుగు చూసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మలయాళీలు వారి సొంత ప్రాంతాలకు చేరుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

స్థానిక సంస్థల హవా

స్థానిక సంస్థల హవా

కేరళలో గ్రామ పంచాయితీలు, బ్లాక్ పంచాయితీలు, జిల్లా పంచాయితీలు, మునిసిపాలిటీలు, కార్పోరేషన్ లకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి.

*. 941 గ్రామ పంచాయితీల్లోని 15, 962 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

*. 152 బ్లాక్ పంచాయితీల్లోని 2, 080 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

*. 14 జిల్లా పంచాయితీల్లోని 331 విభాగాలకు ఎన్నికలు జరిగాయి.

*. 86 మునిసిపాలిటీల్లోని 3, 078 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.

*. ఆరు మునిసిపల్ కార్పోరేషన్లలోని 414 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.

2015లో ఎవరి సత్తా ఏమిటంటే ?

2015లో ఎవరి సత్తా ఏమిటంటే ?

2015లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్ డీఎఫ్ 914 గ్రామ పంచాయితీల్లోని 551 వార్డుల్లో, 86 మునిసిపాలిటీల్లోని 42 వార్డుల్లో, 14 జిల్లా పంచాయితీల్లో 7 పంచాయితీల్లో, 152 బ్లాక్ పంచాయితీల్లో 88 వార్డులు, 6 కార్పోరేషన్లలోని 5 కార్పోరేషన్లలో విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు విజయం సాధించి అప్పట్లో కాలర్ ఎగరేశారు.

రెండో స్థానంలో యూడీఎఫ్..... లాస్ట్ లో ఎన్డీఏ

రెండో స్థానంలో యూడీఎఫ్..... లాస్ట్ లో ఎన్డీఏ

యూడీఎఫ్ ఆధ్వర్యంలోని పార్టీలు 362 పంచాయితీ వార్డులు, 7 జిల్లా పంచాయితీలు, రెండు కార్పోరేషన్లు, 40 మునిసిపాలిటీలు, 63 బ్లాక్ పంచాయితీల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలించింది, ఇక బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పార్టీలు కేవలం 14 పంచాయితీలు, 1 మునిసిపాలిటీల్లో విజయం సాధించి చివరి స్థానంలో నిలిచింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కేరళలో తన సత్తా చాటుకోవాలని ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ రోజు ఎవరి భవిష్యత్తు ఏమిటి ? అనే విషయం తేలిపోతుంది.

English summary
Kerala local body election 2020: The counting of votes for local body elections in Kerala has begun on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X