వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో తగ్గిన కరోనా.. 11 వేల కేసులు, 58 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కేర‌ళ‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 20 వేల నుంచి 15 వేల కేసులు వరకు వచ్చాయి. సోమవారం 11 వేల పైచిలుకు వచ్చాయి. ఇవాళ మాత్రం కేవ‌లం 11,699 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 46,41,614కు పెరిగింది. ఇవాళ 58 మంది క‌రోనా బాధితులు చనిపోవడంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 24,661కి చేరింది.

గత 24 గంట‌ల్లో కొత్త‌గా రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య మాత్రం పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ‌గానే ఉంది. ఇవాళ మొత్తం 17,763 మంది క‌రోనా బాధితులు మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 44,59,193కు చేరింది. క‌రోనా మ‌ర‌ణాలు, రిక‌వ‌రీలు పోగా ప్ర‌స్తుతం 1,57,158 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా 14 జిల్లాలో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న‌ది. ఇవాళ త్రిసూర్‌లో అత్య‌ధికంగా 1,667 మందికి పాజిటివ్ వ‌చ్చింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 Kerala logs 11,699 new cases, 58 deaths

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

English summary
Kerala on Monday recorded 11,699 new Covid-19 cases along with 58 more deaths. The test positivity rate in the state stands at 14.55 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X