వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ జిహాద్ కేసు: ఎన్ఐఏ విచారణకు సుప్రీం ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేర‌ళలో 'లవ్ జిహాద్‌' అంశంపై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నాయకత్వం వహించనున్నారు. కేరళకు చెందిన లవ్‌ జిహాదీ కేసును తొలిసారిగా సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.

కేరళలో లవ్ జిహాద్ ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయ‌ని ఎన్ఐఏ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది. కాగా, న్యాయమూర్తులు చీఫ్‌ జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. సదరు అమ్మాయిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కేరళ ప్రభుత్వం, ఎన్‌ఐఏ ఇచ్చే ఆధారాల ఆధారంగానే కేసును పూర్తి విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం వెల్లడించింది.

సదరు అమ్మాయితో న్యాయస్థానం మాట్లాడిన తర్వాతే ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది కపిల్‌ సిబల్‌ గత విచారణ సమయంలో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బాధిత యువతిని కోర్టుకు తీసుకురావాలని సూచించింది.

Kerala love Jihad case: SC orders NIA to investigate the matter

కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని 2016లో పెళ్లాడింది. ఈ విషయం వివాదాస్పదమైంది.
ఈ వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సదరు బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

పిటిషనరు తరపున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తున్నారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఇది ఇలా ఉండగా, ఆ మ‌హిళ మ‌తం మార్చుకోవ‌డం, ముస్లిం యువ‌కుడిని పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన వ్య‌క్తులే ఇలాంటి మ‌రో ఘ‌ట‌న‌లోనూ ఉన్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ విచార‌ణ‌ను ఏజెన్సీకి అప్ప‌గించ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేర‌ళ పోలీసుల త‌ర‌ఫున హాజ‌రైన సీనియ‌ర్ అడ్వొకేట్ వీ గిరి కోర్టుకు స్ప‌ష్టంచేశారు.

English summary
The Supreme Court on Wednesday ordered the National Investigating Agency to probe on Hadiya's conversion and subsequent allegations of love jihad. The matter will be supervised by former Supreme Court judge R V Raveendran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X