వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ లవ్ జిహద్ కేసు: ఎవరితో కలిసి జీవించాలనేది హదియా ఇష్టం: సుప్రీం కోర్టు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేరళ లవ్ జిహద్ కేసులో సుప్రీం కోర్టు మంగళవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరితో కలిసి జీవించాలనే విషయమై నిర్ణయం తీసుకొనే హక్కు
హదియాకే ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది ఆమె వైవాహిక జీవితంలో జోక్యం చేసుకొనే న్యాయ బద్దత లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కేరళ లవ్‌ జిహాద్‌ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం నాడు లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దర్యాప్తు చేసుకోవచ్చని ఎన్ఐఏను కోరింది. అయితే అదే సమయంలో హదియా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకొనే న్యాయబద్దత మాత్రం లేదని కోర్టు అభిప్రాయపడింది.

Kerala love jihad case: Supreme Court says only Hadiya has right to decide on her choices

మేజరైన యువతిని తల్లిదండ్రులతోనే కలిసి ఉండాలనే చెప్పేందుకు ఎవరికీ కూడ హక్కు లేదని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది.ఎవరితో జీవించాలన్న నిర్ణయం కూడా పూర్తిగా ఆమెకు మాత్రమే ఉంటుంది. పైగా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు న్యాయస్థానాలకు కూడా ఉండదని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22వ,తేదికి వాయిదా వేసింది. కేరళకు చెందిన అఖిల ఆశోకన్‌(25) అనే యువతి గతేడాది డిసెంబర్‌లో మతమార్పిడికి పాల్పడి హదియాగా పేరు మార్చుకుని షఫీన్‌ జహాన్‌ను వివాహం చేసుకుంది.

అఖిల తండ్రి మాత్రం అది బలవంతంగా మతం మార్పిడి వివాహం అని ఫిర్యాదు చెయ్యటంతో వ్యవహారం 'లవ్ జిహాద్ కేసు' గా మారి దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఎన్‌ఐఏ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇక హదియ వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేయటంతో ఆమె భర్త షఫీన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కేసు విచారణ కొనసాగుతోంది.

English summary
Kerala love jihad case: Supreme Court says only Hadiya has right to decide on her choices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X