• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంచలనం: 'లవ్ జిహాదీ'లో మరో మలుపు, తండ్రే క్రూరంగా హింసిస్తున్నాడని?

|

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి మొట్టమొదటి లవ్ జిహాదీ కేసులో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా బాధిత బాలికకు సంబంధించిన ఓ వీడియోను హిందుత్వవాది రాహుల్ ఈశ్వర్ బయటపెట్టారు.

ఆ వీడియోలో బాధితురాలు అఖిల అలియా హదియా తన గోడు వెల్లబోసుకుంది. 'నా తండ్రే నన్ను నన్ను క్రూరంగా హింసిస్తున్నాడు. నన్ను చంపేసేలా ఉన్నారు. దయచేసి ఇక్కడి నుంచి నన్ను విడిపించండి' అంటూ అందులో వేడుకుంది. దీంతో ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నందుకు.. ఇంట్లోవాళ్లు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 kerala love jihad: 'My father hits me, I'll be killed anytime,' says Hadiya

మరోవైపు అఖిల తండ్రి అశోకన్ కేఎం మాత్రం కుమార్తె చేసిన ఆరోపణలను ఖండించారు.రాహుల్‌ ఈశ్వర్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. షఫిన్‌ జహాన్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అందుకే తన కూతురిని లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి చేయించాడని అన్నారు.

అఖిల వీడియోను జస్టిస్‌​ రవీంద్రన్‌కు వీడియోను మెయిల్‌ చేశానని తెలిపారు. అలాగే మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఇంత చేసినా.. ఎవరూ యువతిని కలిసేందుకు కానీ, ఆమె నుంచి వివరాలు సేకరించేందుకు కానీ ప్రయత్నించకపోవడం గమనార్హం.

కాగా, రాహుల్ గతంలో అఖిల తల్లి పొన్నమ్మ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేరళలో చోటు చేసుకున్న ఈ కేసును హైకోర్టు లవ్ జిహాదిగా అభివర్ణించి వివాహాన్ని రద్దు చేసింది. 24 ఏళ్ల అఖిల అశోకన్ అనే యువతిని ఇస్లాం మతంలోకి మార్చి.. షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

హైకోర్టు తమ వివాహాన్ని రద్దు చేయడంతో షఫిన్ సుప్రీం కోర్టులో దాన్ని సవాల్ చేశారు. ద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలు ఉన్నాయన్న ప్రాసిక్యూటర్‌ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.

ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. అదే సమయంలో ఇద్దరు మేజర్ల వివాహాన్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానికి ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో అఖిల తండ్రికి కూడా ఆమెను నియంత్రించే హక్కు లేదని గుర్తుచేసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
You need to get me out...I will be killed anytime," said Hadiya, who was put in the protective custody of her parents by the Kerala High Court in June after it annulled her marriage on the charge of ‘love jihad’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more