హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్ స్టోరీ: వీధిబాలల కడుపు నింపిన కేరళ టెక్కీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మానవత్వానికి వెల కట్టే మిషన్‌ను ఇంకా ఎవరూ కనిపెట్టలేదు అంటూ కేరళలోని ఓ హోటల్ ఓ యువకుడికి అరుదైన బిల్లును ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే కేరళలోని మలప్పురంలో సి. నారాయణన్ అనే వ్యక్తి ‘హోటల్ సబ్రినా' పేరిట ఓ భోజనశాలను నిర్వహిస్తున్నారు.

ఈ హోటల్‌లో భోజనం చేసేందుకు గాను ఓ యువకుడు అక్కడి వచ్చాడు. చేతులు కడుక్కుని ఓ టేబుల్ ముందు కూర్చుని భోజన్ ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ చేసిన భోజనం ఇంకా టేబుల్ మీదకు రాలేదు. అదే సమయంలో పక్కనున్న అద్దాల్లోంచి అటుగా బయటకు చూసిన ఆ వ్యక్తికి హోటల్‌లోని భోజనం వైపు ఇద్దరు చిన్నారులు ఆకలిగా చూస్తూ కనిపించారు.

దీంతో ఆ యవకుడు వారిద్దరిని లోపలికి రమ్మని సైగ చేశాడు. అలా సైగ చేశాడో లేదో ఆకలితో నకనకలాడుతున్న ఓ వీధి బాలుడు, అతడి చిన్నారి చెల్లెలిద్దరూ లోపలికి వచ్చారు. వారిద్దరిని తన టేబుల్ వద్ద కూర్చొబెట్టుకున్న ఆ యువకుడు భోజనం పెట్టించాడు.

Kerala man feeds hungry street kids in a restaurant, gets surprised by the bill

ఆకలితో ఉన్న వారిద్దరూ కడుపు నిండా భోజనం తిన్న తర్వాత చేతులు కడుక్కొని ఆ యవకుడికి కృతజ్ఞతలు చెప్పకుండానే, కళ్లతో ధన్యవాదాలు చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే తాను ఆర్డర్ చేసిన భోజనాన్ని తినకుండానే ఆ యువకుడికి కడుపు నిండిపోయింది.

అనంతరం బిల్లు తెమ్మని హోట్ల సిబ్బంది ఆ యవకుడు సూచించాడు. హోటల్ సిబ్బంది బిల్లు తెచ్చిచ్చాడు. ఆ బిల్లును చూసిన యువకుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. అందులో ఏముందంటే... ఆంగ్లంలో రాసిన రెండు వాక్యాలున్నాయి.

‘‘వియ్ డోన్ట్ హ్యావ్ ఏ మెషీన్ దట్ క్యాన్ బిల్ హ్యూమానిటీ. మె గుడ్ హ్యాపెన్ టు యూ.(మానవత్వాన్ని కొలిచే మెషీన్ మా వద్ద లేదు. మీకంతా మంచే జరగాలి)'' అన్న ఆ పదాలను చూసి ఆ యువకుడు భోజనం చేయకుండానే కడుపు నిండిపోయిన స్థితిలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ సంఘటన మొత్తాన్ని ‘రూట్ థింకర్స్' పేరిట ఓపెన్ అయిన ఓ ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ నెల 6న ఓ స్టోరీని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ను 1190 మంది నెటిజన్లు షేర్ల మీద షేర్ చేస్తున్నారు. అంతేకాదు లైక్‌ కూడా చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన స్టోరీ మొత్తం మళయాళంలో ఉండటం విశేషం.

అయితే వీధి బాలల పట్ల తన మానవత్వాన్ని చాటుకున్న అతడి పేరు అఖిలేష్ కుమార్. దుబాయ్‌కి చెందిన పవర్ సొల్యూషన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్‌సీ అనే కంపెనీలో సీనియర్ టెక్నికల్ సేల్స్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. తన సొంతూరైన మలప్పురానికి వచ్చిన సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

English summary
Here's a story of a man, who's name hasn't been disclosed, who encountered instant karma. Smile The story originally written in Malayalam, and posted to a public group on Facebook by the name Right Thinkers, has by now got over 1190 shares. Here's the story, cut short.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X