వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cheating: సన్నీలియోన్ పై చీటింగ్ కేసు, రోజుకు రూ. 29 లక్షలు, అదే నా వృత్తి, హై కోర్టులో !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ ముంబాయి: చీటింగ్ కేసుకు సంబంధించి మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిక్కుల్లో పడ్డారు. ఒక రోజు కార్యక్రమం కోసం సన్నీ లియోన్ కు రూ. 29 లక్షలు ఇచ్చి మోసపోయామని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే సన్నీ లియోన్ మీద చీటింగ్ కేసు నమోదైయ్యింది. నేను నటి, ఆ రోజు వస్తానని వాళ్లకు చెప్పి మాట ఇచ్చాను. నా వృత్తే అది, నాకు చెప్పిన డేట్ కు పిలుపించుకోవడంలో వాళ్లు విఫలం అయ్యారు. నన్ను ఏం చెయ్యమంటారు మీరే చెప్పండి అంటూ సన్నీ లియోన్ బాంబుపేల్చేంది. అయితే సన్నీ లియోన్ ను అరెస్టు చెయ్యకూడదని స్టే ఇచ్చిన కేరళ హైకోర్టు ముందుగా ఆమెకు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది.

Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!

 మాజీ పోర్న్ స్టార్...... బాలీవుడ్ నటి

మాజీ పోర్న్ స్టార్...... బాలీవుడ్ నటి

పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్ ఎంత క్రేజ్ సంపాధించుకుందో అందరికీ తెలుసు. కుర్రకారును కిక్కేంచి వారి దిమ్మతిరిగిపోయే రసవత్తరమై మసాలా పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ లియోన్ కు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. పోర్న్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సన్నీ లియోన్ తరువాత బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

 రోజుకు రూ. 29 లక్షలు

రోజుకు రూ. 29 లక్షలు

కేరళలో 2019లో ఓ కార్యక్రమానికి సన్నీ లియోన్ ను ఆహ్వానించాలని ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వహకులు నిర్ణయించారు. కేరళలో జరిగే కార్యక్రమానికి హాజరౌతానని తమ దగ్గర రూ. 29 లక్షలు తీసుకున్న సన్నీ లియోన్ తరువాత ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని, మమ్మల్ని మోసం చేసిందని ఆరోపిస్తూ శియాస్ అనే వ్యక్తి కేరళలోని ఎర్నాకుళం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు.

 షూటింగ్ కోసం వెళ్లిన మేడమ్ విచారణ

షూటింగ్ కోసం వెళ్లిన మేడమ్ విచారణ

సన్నీ లియోన్ పై నమోదైన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఓ షూటింగ్ లో పాల్గొనడానికి సన్నీ లియోన్ కేరళ వెళ్లారు. విషయం తెలుసుకున్న ఎర్నాకుళం పోలీసులు మేడమ్ సన్నీ లియోన్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. అసలు ఏం జరిగిందో అనే విషయంపై ఎర్నాకుళం పోలీసులకు సన్నీ లియోన్ క్లారిటీ ఇచ్చారని తెలిసింది.

 అవును....డబ్బులు తీసుకుంది నిజమే

అవును....డబ్బులు తీసుకుంది నిజమే

తన మీద నమోదైన కేసు విషయంపై సన్నీ లియోన్ కేరళలో మీడియాతో మాట్లాడారు. ఒక కార్యక్రమానికి హాజరుకావాలని ఆ కార్యక్రమం నిర్వహకులు తనను కలిశారని, వారి దగ్గర నేను డబ్బులు తీసుకున్నానని సన్నీ లియోన్ అంగీకరించారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరుకావడానికి తనకు పూర్తి డబ్బులు ఇవ్వలేదని, అందుకే తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని సన్నీ లియోన్ అన్నారు.

 అదే నా వృత్తి..... అందుకే అలా జరిగింది

అదే నా వృత్తి..... అందుకే అలా జరిగింది

తాను కార్యక్రమానికి హాజరుకావాలంటే పూర్తి డబ్బులు చెల్లించాలని తాను చెప్పానని, అందుకే వారికి చాలా సమయం ఇచ్చానని, వాళ్లు డబ్బులు ఇవ్వడంలో విఫలం కావడం వలనే తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని సన్నీ లియోన్ అన్నారు. నేను నటిని, కార్యక్రమాలకు హాజరుకావడానికి నేను డబ్బులు తీసుకుంటాను, నా వృత్తే అది, డబ్బులు ఇవ్వలేదని తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని సన్నీ లియోన్ అన్నారు.

 తప్పు నాదికాదు..... వాళ్లదే

తప్పు నాదికాదు..... వాళ్లదే

ముందుగా అడ్వాన్స్ తీసున్న తరువాతే తాను ఏదైనా కార్యక్రమాలకు హాజరుకావడం అలవాటుగా పెట్టుకున్నానని, అందుకే కేరళ కార్యక్రమం విషయంలో అలా జరిగిందని, అందులో తన తప్పు ఏమీ లేదని ఎర్నాకుళం పోలీసులకు వివరణ ఇచ్చానని, పోలీసులు వాళ్ల పనివాళ్లు చేసుకుని వెలుతారని మేడమ్ సన్నీ లియోన్ చల్లగా మీడియాకు వివరణ ఇచ్చారు.

 హైకోర్టుకు సన్నీ లియోన్

హైకోర్టుకు సన్నీ లియోన్

ఎర్నాకుళంలో నమోదైన చీటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో సన్నీ లియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం కేరళ హైకోర్టు వాదనలు జరిగాయి. సన్నీ లియోన్ ను అరెస్టు చెయ్యకూడదని స్టే ఇచ్చిన కేరళ హైకోర్టు ముందుగా ఆమెకు నోటీసులు ఇవ్వాలని, తరువాత చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించింది.

English summary
Cheating: Kerala man filled Rs. 29 lakh cheating case on actress Sunny Leone. She talks about the case with media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X