• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మ .. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ ... రెండో పెళ్లి చేసుకున్న తల్లికి భావోద్వేగంతో లేఖ ...

|

తిరువనంతపురం : సాధారణంగా రెండో పెళ్లి చేసుకున్న తల్లి లేదా తండ్రిని పిల్లలు ద్వేషిస్తుంటారు. ఎందుకిలా చేశావని నిలదీస్తుంటారు. ఎంత విద్యావంతులైన సరే .. రెండో పెళ్లిపై తమ అభిప్రాయంలో మాత్రం ఎలాంటి తేడా చూపించారు. కానీ కేరళలో మాత్రం గోకుల్ శ్రీధర్ అనే వ్యక్తి .. తన తల్లి రెండో పెళ్లి చేసుకున్నందుకు భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ శ్రీధర్ భావోద్వేగానికి కారణమేంటో తెలుసుకుందాం.

 వేధింపులు తాళలేక ..

వేధింపులు తాళలేక ..

కేరళకు చెందిన గోకుల్ శ్రీధర్ ఉన్నత విద్యావంతుడు. కానీ అతని తండ్రి మాత్రం మూర్ఖుడు. భార్యను నిత్యం వేధించేవాడు. ఆమెపై దాడిచేయడంతో కాలి కూడా విరిగింది. అతని వేధింపులను భరించడంతో ... అతని ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఎందుకమ్మా ఇంత కొట్టినా, తిట్టినా భరిస్తున్నావు అని పిల్లాడు అడిగినప్పుడు నీ కోసమే కన్న అని తల్లి చెప్పింది. చివరికి తండ్రి కబందహస్తాల నుంచి వారు బయటపడ్డారు. చాలారోజుల తర్వాత శ్రీధర్ తల్లి రెండో పెళ్లి చేసుకుంది. దీంతో గోకుల్ శ్రీధర్ భావోద్వేగంతో తన తల్లికి లెటర్ రాశాడు. ఈ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. ఇప్పటికే ఆ లేఖకు 29 వేల లైకులు రాగా .. 3 వేల సార్లు షేర్ చేశారు.

 హ్యాపీ మ్యారేజ్ డే 'మా‘...

హ్యాపీ మ్యారేజ్ డే 'మా‘...

'రెండో పెళ్లి చేసుకున్నందుకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు .. అని లేఖ ప్రారంభించారు గోకుల్. ఏంతో చెప్పాలని ఉంది .. అయినా ఏం చెప్పలేకపోతున్నాను అని పేర్కొన్నారు. నీవు నాన్నతో పడిన నరకాన్ని కళ్లారా చూశాను. నాన్న కొట్టడంతో కాలువిరిగి అచేతనంగా ఉండటం చూసి జాలిపడ్డాను. కొన్నిసార్లు కొట్టడంతో నుదురు భాగంలో దెబ్బ తగలింది. నా కోసం జీవితాన్నే త్యాగం చేశావు. సుఖ, సంతోషాలు వదులకున్నావు. జీవితంలో కొన్ని సంవత్సరాలు త్యాగం చేశావు. ఇప్పుడు మళ్లీ జీవితంలో స్థిరపడటం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఎంత ఆనందం కలుగుతుందే మాటల్లో చెప్పలేను‘ అని గోకుల్ లేఖలో భారమైన హృదయంతో రాశారు.

రెండో పెళ్లే .. కానీ ...

రెండో పెళ్లే .. కానీ ...

వాస్తవానికి సమాజంలో రెండో పెళ్లి అంటేనే చిన్నచూపు. ఇక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు. ఏ కులం, మతంలోనైనా రెండో పెళ్లి అంటే అదేదో తప్పుగా చూస్తారు. సమాజం కూడా అంగీకరించదు. కానీ తన తల్లి తన కోసం పడ్డ బాధను చూసి ... జీవితాన్ని త్యాగం చేసిందని కళ్లారా చూసిన .. గోకుల్ శ్రీధర్ ఒక గొప్ప మనస్సున వాడిగా నిలిచిపోయారు. తన తల్లి రెండో పెళ్లి చేసుకుందని సగర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పెద్దతనాన్ని నిరూపించుకున్నారు. కానీ కొందరు రెండో పెళ్లి అంటేనే ద్వేషంతో, అసహ్యంగా చూస్తారు. కానీ తన తల్లి జీవితంలో జరిగింది వేరు అని చెప్తున్నారు గోకుల్. అంతేకాదు తన లేఖతోపాటు తన తల్లి రెండో పెళ్లి చేసుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు గోకుల్. యువకుడు చేసిన పనిని సాహసోపేతమైన చర్య అని .. మంచి చేశావని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
mother, happy married life." Kerala's Kollam-based Gokul Sreedhar concluded his post on Facebook with this statement and the internet, needless to mention, is all hearts. In the heartwarming post that has been shared in Malayalam, Gokul congratulated his mother for her second marriage. From Gokul's post, it appears that she "suffered" a lot in what has been referred to as a "disastrous marriage," after which, she decided to move on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more