వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సిగరెట్లు' మానేసినందుకు జీవితంలో ఊహించని మార్పు... ఆదర్శంగా నిలుస్తున్న 'నాయర్'..

|
Google Oneindia TeluguNews

8 ఏళ్ల క్రితం అతనో చైన్ స్మోకర్. రోజుకు ఒకటిన్నర నుంచి రెండు పెట్టెలు సిగరెట్స్ కాల్చేవాడు. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడింది. వైద్యుడి వద్దకు వెళ్తే... ఇక నువ్వు స్మోకింగ్ మానేయాల్సిందేనని చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకూ అతను మళ్లీ సిగరెట్ ముట్టలేదు. అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాదు... డబ్బునూ ఆదా చేసినట్లయింది. ఈ 8 ఏళ్లలో కేవలం సిగరెట్లు కాల్చనందువల్ల రూ.5లక్షల డబ్బు వెనకబడింది. ఆ డబ్బుతో ఇప్పుడతను సొంత ఇల్లు కట్టుకున్నాడు.

కేరళకు చెందిన 75ఏళ్ల వేణుగోపాలన్ నాయర్ కథ ఇది.టీనేజీలోనే స్మోకింగ్‌కి అలవాటుపడ్డ అతను 67 ఏళ్ల వరకూ పొగ తాగాడు. 8ఏళ్లుగా,అంటే 100 నెలల పాటు స్మోకింగ్‌కి దూరంగా ఉండటంతో రూ.5లక్షలు వెనకేశాడు. నాయర్‌కు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకోవాలని,అందుకోసం డబ్బు జమ చేయాలని ఓ మాజీ భవన నిర్మాణ కార్మికుడు చెప్పిన మాటలు ఆయనపై ప్రభావం చూపించాయి.

 kerala man quits smoking 8 years back and gets home with saved rs.5 lakh

'13 ఏళ్ల వయసులోనే నేను పొగ తాగడానికి అలవాటయ్యాను. మొదట్లో బీడీలు తాగేవాడిని. అప్పట్లో మూడు క్వార్టర్ అణాలకు మూడు బీడీలు వచ్చేవి. తర్వాతి రోజుల్లో సిగరెట్ తాగడానికి అలవాటయ్యాను. 67 ఏళ్ల వయసొచ్చేసరికి ఆ అలవాటు పీక్స్‌కి వెళ్లింది. అయితే ఛాతీలో నొప్పి రావడంతో పొగ తాగే అలవాటు మానుకున్నాను.' అని నాయర్ తెలిపారు.

Recommended Video

టార్గెట్ కర్ణాటక, కేరళ.. United Nations హెచ్చరిక || Oneindia Telugu

తాను స్మోకింగ్ మానేసే సమయానికి ఒక సిగరెట్ పెట్టె ధర రూ.50గా ఉందని చెప్పాడు. అప్పట్లో ఒకరోజుకు పెట్టెన్నర నుంచి రెండు పెట్టెల సిగరెట్స్ కాల్చేవాడినని చెప్పాడు. తాను వెనకేసుకున్న కొద్దిపాటి డబ్బుతో పాటు సిగరెట్లు మానేయడంతో ఆదా అయిన రూ.5లక్షలతో సొంత ఇల్లు కట్టుకున్నట్లు చెప్పాడు.అంతేకాదు,భవిష్యత్తులో రెండో అంతస్తు కూడా నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు. నాయర్ కథనం వెలుగులోకి రావడంతో చైన్ స్మోకర్స్ కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పొగ తాగడం మానేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Until eight years ago, a good part of 75-year-old Venugopalan Nair’s earnings literally went up in smoke. Cigarette smoke, to be precise. But a medical check-up finally acted as a wake-up call for Nair to quit smoking and his life changed forever. Not only did the decision prove to be beneficial for his health but also for his finances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X