వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య ఒంటి నిండా ఆభరణాలు: సొంతం చేసుకోవడానికి భారీ స్కెచ్: పాములతో కాటు: యూట్యూబ్‌లో

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: పాముకాటుతో ఓ మహిళ మరణించగా.. పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసిన ఉదంతం ఇది. భార్యను చంపడానికి అతను రెండుసార్లు ఆమెపై పాములను వదిలాడు. రెండుసార్లూ ఆమె పాముకాటుకు గురయ్యారు. మొదటిసారి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నా..రెండోసారి బలి అయ్యారు. పాముకాటుతో మరణంచారు. భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆభరణాలు, ఆమె పేరు మీద బ్యాంకు డిపాజిట్లను సొంతం చేసుకోవడానికే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అతనితో పాటు సహకరించిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు.

టీటీడీ భూములను అమ్మనివ్వం: నా ప్రయత్నాలు అమరావతిలో సక్సెస్: ఇక్కడా అదే ఫార్ములాటీటీడీ భూములను అమ్మనివ్వం: నా ప్రయత్నాలు అమరావతిలో సక్సెస్: ఇక్కడా అదే ఫార్ములా

బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల కోసం

బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల కోసం

కేరళలోని కొల్లం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇది. మృతురాలి పేరు ఉత్రా. కొల్లం జిల్లాలోని ఆంచల్ గ్రామానికి చెందిన ఆమెకు పత్తినంథిట్ట జిల్లా ఆడూర్‌కు చెందిన సూరజ్‌తో వివాహమైంది. సూరజ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో ఉత్రా తల్లిదండ్రులు భారీగా కట్నం ఇచ్చారు. ఆమె పేరు మీద బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేశారు. సూరజ్ చేతికి కట్నం డబ్బులు ఇవ్వలేదు. మొత్తం తమ కుమార్తె పేరు మీదే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇది అతనికి నచ్చలేదు. అదనపు కట్నం కోసం తరచూ భార్యతో గొడవ పడేవాడు.

పాముకాటుతో చనిపోయేలా ప్లాన్..

పాముకాటుతో చనిపోయేలా ప్లాన్..

ఉత్ర మరణిస్తే.. ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు తనకు దక్కుతాయని భావించాడు. దీనికోసం స్కెచ్ వేశాడు. పాములతో కాటు వేయించి, హత్య చేయాలని ప్రయత్నించాడు. అలా చేయడం వల్ల దాన్ని యాక్సిడెంట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చనేది అతని ప్లాన్. దీనికి అనుగుణంగా అతను 10 రూపాయలు ఖర్చు పెట్టి రెండు పామును కొనుగోలు చేశాడు. తిరువనంతపురంలో ఉన్న భార్యను ఆడూర్‌లోని సొంతింటికి తీసుకెళ్లాడు. మార్చి 22వ తేదీన ఆమె పాముకాటుకు గురయ్యారు. ఆమెను రక్షించినట్లు నటించాడు. ఆసుపత్రికి తరలించాడు. ఆమె కోలుకున్నారు. అనంతరం భార్యను కొల్లం జిల్లాలోని ఆంచల్ గ్రామానికి తీసుకెళ్లాడు.

రెండుసార్లు పాములతో కాటు

రెండుసార్లు పాములతో కాటు

తనకు పాములను సరఫరా చేసిన వ్యక్తిని అక్కడికి పిలిపించుకున్నాడు. ఈ నెల 6వ తేదీన పుట్టింట్లో ఆమె నిద్రిస్తుండగా.. పామును విడిచి పెట్టాడు. రెండోసారి పాముకాటుకు గురైన ఆమె మరణించారు. రెండుసార్లు పాముకాటుకు గురి కావడం పట్ల ఉత్ర కుటుంబీకుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నెల 7వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండుసార్లు ఉత్ర పాముకాటుకు గురికావడానికి భర్తే కారణమని నిర్ధారించారు. సూరజ్ సహా పాములను విక్రయించిన వ్యక్తితో పాటు ఉత్రను హత్య చేయడానికి సహకరించిన మరొకరిని అరెస్టు చేశారు.

Recommended Video

Vande Bharat Mission: Stranded Indians Reached And, Expresses Gratitude to Indian Govt
 యూట్యూబ్ ద్వారా ప్రయత్నం..

యూట్యూబ్ ద్వారా ప్రయత్నం..

నిందితులపై హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు కొల్లం రూరల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేఎస్ హరిశంకర్ తెలిపారు. పాములతో ఎలా కాటు వేయించాలనే విషయంపై సూరజ్ మూడు నెలల పాటు యూట్యూబ్ ద్వారా.. వాటికి సంబంధించిన వీడియోలను క్రమం తప్పకుండా చూసేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. రెండోసారి పాముకాటుకు గురైనప్పుడు ఉత్ర స్పృహ కోల్పోయారని, ఆమెను ఆసుపత్రికి తరలిచడంలో ఉద్దేశపూరకంగా జాప్యం చేశాడని అన్నారు. ఇక్కడే అతను అనుమానస్పదంగా వ్యవహరించినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఆ కోణంలో తాము దర్యాప్తు చేశామని అన్నారు.

English summary
In a chilling plot, a man allegedly killed his 25-year old wife by letting a cobra bite her in her sleep near here early this month with police cracking it following suspicions raised by her family as it was the second time she suffered a snake attack in three months. Police said after investigations by the crime branch they arrested Sooraj, a private bank employee from Adoor in Pathanamthitta district, and a snake-catcher who supplied the cobra and a Russell''s viper, both highly poisonous, on charges of killing the woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X