• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Mystery: మూడు నెలలకే రెండో భర్త ఎస్కేప్: రూ. 30 లక్షలు, రూ. 20 లక్షల నగలు మాయం, లాడ్జ్ లో శవం!

|

కన్నూర్/ కోజికోడ్/ కేరళ: శ్రీమంతుల కుటంబానికి చెందిన 36 ఏళ్ల మహిళకు లెక్కలేనంతమంది బంధువులు ఉన్నారు. ఆమె తండ్రి కోటీశ్వరుడు. మంచి ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయిన వ్యక్తి కుమార్తె ఆమె. తండ్రి వారసులుగా సోదరులుప్రస్తుతం వ్యాపారాలు చేస్తున్నారు. టైమ్ బాగలేక పెళ్లి చేసుకున్న భర్త విడాకులు ఇవ్వడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుంది.

రెండో పెళ్లి చేసుకున్న భర్త నిలువునా ముంచేసి మాయం కావడంతో ఆమె అయోమమానికి గురై బంధువుల ముందు తలదించుకుంది. ఇదే సమయంలో ఓ హోటల్ గదిలో ఆమె అనుమానాస్పదస్థితిలో శవమై కనించడంతో ఆమె కుటంబ సభ్యులతో పాటు బంధువులు షాక్ కు గురైనారు. అంతకు ముందు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ మహిళ దగ్గర రూ. 30 లక్షల నగదు, రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయి.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

తండ్రి చాటు అమ్మాయి

తండ్రి చాటు అమ్మాయి

కేరళలోని కన్నూరు జిల్లా కోట్టకున్ను ప్రాంతానికి చెందిన ఎం. ముకుందన్ హెడ్ మాస్టర్ గా పని చేస్తూ రిటైడ్ అయ్యారు. మంచి ఉద్యోగం చేస్తున్న ముకుందన్ కు అంతకు ముందే మంచి ఆస్తులు ఉన్నాయి. ముకుందన్ కుమార్తె అఖిల పరయిల్ (36). పదవ తరగతి ,ఇంటర్ లో అఖిల స్కూల్ ఫస్ట్ వచ్చింది. తరువాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అఖిల తండ్రిచాటు అమ్మాయిగా ఉండేది.

పెళ్లితో అఖిలకు రామాయణం

పెళ్లితో అఖిలకు రామాయణం

తల్లిదండ్రులు, బంధువులు చూసిన వ్యక్తిని అఖిల వివాహం చేసుకుంది. వివాహం అయిన తరువాత భర్తతో అఖిలకు విభేదాలు వచ్చాయి. పెద్దలు పంచాయితీలు చేసినా అఖిల కాపురం చక్కబడలేదు. ఇక చేసేది లేక అఖిల 2016 డిసెంబర్ నెలలో మొదటి భర్తతో చట్టప్రకారం విడాకులు తీసుకుని పుట్టింటికి వచ్చేసింది.

భర్త, తండ్రి ఆస్తులు

భర్త, తండ్రి ఆస్తులు

2016లో భర్తతో విడాకులు తీసుకున్న అఖిలకు చట్టప్రకారం బాగా డబ్బులు వచ్చింది. వచ్చిన ఆస్తుల్లో కొన్ని ఆస్తులు విక్రయించగా రూ. 30 లక్షలకు పైగా నగదు వచ్చింది. అదే సమయంలో అఖిల దగ్గర 40 సవర్ల బంగారం, రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నాయి. పుట్టింటికి వచ్చిన తరువాత అఖిల తండ్రి ముకుందన్ చనిపోయారు. తండ్రి ముకుందన్ చనిపోవడంతో అఖిలకు కొన్ని ఆస్తులు వచ్చాయి.

మూడు నెలలకే రెండో మొగుడు ఎస్కేప్

మూడు నెలలకే రెండో మొగుడు ఎస్కేప్

మొదటి భర్తతో విడాకులు తీసుకున్న వెంటనే అఖిల అంబులెన్స్ డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అఖిల రూ. 30 లక్షల డబ్బు, 40 సవర్ల బంగారం, కారు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న అంబులెన్స్ డ్రైవర్ మూడు నెలలకే అఖిలకు నామం పెట్టి జెండా ఎత్దేశాడు. చివరికి రెండో భర్త కోసం అఖిల అనేక ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోయిందని తెలిసింది.

లాడ్జ్ లో శవమైన అఖిల

లాడ్జ్ లో శవమైన అఖిల

15 రోజుల క్రితమే కారులో అఖిల సొంత ఊరు కొట్టకున్ను ప్రాంతానికి వెళ్లింది. అయితే సొంత ఇంటికి 1. 5 కిలోమీటర్ల దూరంలోని ఓ లాడ్జ్ లో అఖిల గది అద్దెకు తీసుకుంది. సొంతఊరికి వెళ్లిన అఖిల కొందరు బంధువుల ఇళ్లకు వెళ్లి వారిని పలకరించి వారితో గడిపింది. 2016 వెళ్లిపోయిన సమయంలో అఖిల చాలా అందంగా ఉండేదని, ఇప్పుడు ఆమె ఆనారోగ్యానికి గురైన్లు కనిపించడంతో బంధువులు ఆరాతీశారు. అదే సమయంలో లాడ్జ్ లో బస చేసిన అఖిల ఆమె ఉంటున్న గదిలో శవమై కనిపించింది. విషయం గుర్తించిన లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. అఖిత తప్పుడు అడ్రస్ తో పాటు ఆమె పేరు అఖిల అనికాకుండా వేరే పేరుతో లాడ్జ్ లో గది అద్దెకు తీసుకోవడం అనేక అనుమానాలకు దారితీసింది.

గతంలో పోలీసులకు చిక్కిన అఖిల

గతంలో పోలీసులకు చిక్కిన అఖిల

కొన్ని నెలల క్రితం కారులో రూ. 4 లక్షలు తీసుకు వెలుతున్న అఖిలను ఆ డబ్బుకు సరైన పత్రాలు చూపించలేదని పోలీసులు అరెస్టు చేసి తరువాత విడిచిపెట్టారని తెలిసింది. తరువాత అల్పాజా, తికరిపూర్, కాసరగూడు తదితర ప్రాంతాల్లో నివాసించిన అఖిల గత మూడు సంవత్సరాల నుంచి బంధువులతో మాత్రం చాలా తక్కువగా టచ్ లో ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే రెండో పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేసే సమయంలో అఖిల దగ్గర రూ. 30 లక్షల నగదు, 40 సవర్ల బంగారు నగలు, ఖరీదైన కారు ఉండేదని ఆమె బంధువులు పోలీసులు సమాచారం ఇచ్చారు.

అఖిలకు ఏం జరిగింది ?

అఖిలకు ఏం జరిగింది ?

అఖిల సొంత బావ బిజు ఎం. భాస్కర్ గతంలో బీఎస్ ఎఫ్ ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం బిజు భాస్కర్ అవినీతి నిరోదక శాఖ, మానవ హక్కుల సంఘంలో మంచి హోదాలో ఉన్నారు. అఖిల అనుమానాస్పదస్థితిలో శవమై కనించిన విషయం బిజు భాస్కర్ కు సమాచారం ఇచ్చారు. అఖిల ఎలా చనిపోయిందో విచారణ జరిపించాలని ఆమె బంధువులు డిమాండ్ చెయ్యడంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు.

English summary
Kerala: Mystery shrouds suside of Kannur woman in lodge in Kerala, relatives demand probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X