వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసు వాపస్ తీసుకుంటే రూ.5 కోట్లు ఇస్తాను: కేరళ నన్‌కు బిషప్ ఆఫర్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ నన్ అత్యాచారఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అత్యాచారం కేసు వాపసు తీసుకుంటే రూ.5 కోట్లు ఇస్తానని బిషప్ ఆఫర్ చేసినట్లు బాధితురాలి సోదరుడు తెలిపారు. బిషప్ ఫ్రాంకోములక్కల్‌ బంధువుతో పాటు మరో ఇద్దరు పాస్టర్లు బాధితురాలి సోదరుడి స్నేహితులను కలిసి ఈ ఆఫర్ ఇచ్చారు.

సన్యాసి మీద బిషప్ 13 సార్లు రేప్సన్యాసి మీద బిషప్ 13 సార్లు రేప్

పోలీసుల సమాచారం మేరకు ఈ ఘటనపై ఓ హైలెవెల్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కేసును కేరళ హైకోర్టు విచారణ జరగనుంది. అంతకుముందు బిషప్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అనంతరం ఆయన అరెస్టుపై గురువారం జరిగే మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటారు. అత్యాచార ఘటనలో పోలీసులు ఎలాంటి విచారణ చేస్తున్నారో..ఇప్పటి వరకు చేపట్టిన విచారణ విధానం కోర్టుకు తెలపాలని ఆదేశించింది. మరోవైపు బాధితురాలి సంరక్షణ కొరకు తీసుకున్న చర్యలు ఏమిటని కూడా పోలీసులను ప్రశ్నించింది న్యాయస్థానం.

Kerala nun offered Rs.5 crore by bishop for withdrawing the case

బిషప్ కేసును మూయించేందుకు రాజకీయంగాను డబ్బులు పరంగాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వాటికన్‌లో కూడా పిటిషన్ దాఖలు చేసింది బాధితురాలు. కేసునుంచి తప్పించుకునేందుకు డయాస్ నిధులను బిషప్ వినియోగిస్తున్నారని వాటికన్‌కు రాసిన పిటిషన్‌లో ఆమె వెల్లడించారు. 2014 నుంచి 2016ల మధ్య ఫ్రాంకో ములక్కల్ తనపై 13 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాను నిర్దోషినని తనకు ఏమి తెలియదని బిషప్ ఫ్రాంకో ములక్కల్ చెబుతున్నారు.

English summary
The brother of the Kerala nun who has accused the bishop of rape alleged that he was offered a bribe of Rs 5 crore if the complaint is withdrawn.According to a report, a relative of Franco Mulakkal and two other priests approached the brother’s friend and conveyed the message that they are willing to pay Rs 5 crore if the nun withdraws her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X