వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ నన్ అత్యాచారం కేసు: బిషప్ ఫ్రాంకో ములక్కల్ రాజీనామాకు వాటికన్ సిటీ ఆమోదం

|
Google Oneindia TeluguNews

కేరళ: కేరళ నన్ పై అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను బాధ్యతల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వాటికన్ సిటీలోని కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 16న తనను తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఫ్రాంకో ములక్కల్ వాటికన్‌కు లేఖ రాశారు. తను జలంధర్ నుంచి కేరళకు తరుచూ ప్రయాణం చేయాల్సి ఉన్నందున తనను తప్పించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను భారత్‌లోని పోప్ ప్రతినిధికి అందజేశారు.

కేరళ నన్‌కు బిషప్ ఆఫర్కేరళ నన్‌కు బిషప్ ఆఫర్

2014 నుంచి 2016 మధ్య కేరళకు చెందిన నన్ పై ములక్కల్ పలుమార్లు లైంగిక దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా నన్ ఫిర్యాదు చేసింది. బుధవారం రోజున పోలీసుల విచారణలో భాగంగా ములక్కల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. విచారణ ముగిశాక పోలీస్ స్టేషన్ బయటకు ఆయన రాగానే చేదు అనుభవం ఎదురైంది. ఆలిండియా యూత్ ఫెడరేషన్, సీపీఐ యూత్ వింగ్‌కు చెందిన కార్యకర్తలు నల్లజెండాలను ఎగురవేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Kerala nun rape case: Vatican accepts resignation of Bishop Franco Mulakkal

ములక్కల్ దిష్టిబొమ్మను కూడా కొందరు తగులబెట్టారు. ఇదిలా ఉంటే గురువారం రోజు ములక్కల్ విచారణ ఒక కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు కొట్టాయం ఎస్పీ హరిశంకర్.మరోవైపు విచారణ సందర్భంగా ములక్కల్ కేరళకు చేరుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరోవైపు తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని.. తనకు ఏపాపం తెలియదని బుకాయించారు. అత్యాచారం అనే పేరు పెట్టి తనపై కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు ములక్కల్.

English summary
Bishop Franco Mulakkal temporarily relieved of his pastoral responsibilities by Vatican," the Catholic Bishop Conference of India said in a statement. In the letter dated September 16, the Bishop expressed willingness to absolve himself of the responsibilities of the diocese since he would have to travel to Kerala several times and has sought permission for the same. The letter was handed over to the Pope's representative in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X