వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులకూ సోకిన కరోనా వైరస్.. సౌదీలో కేరళ నర్సుకు పాజిటివ్.. మరో 30 మందికీ..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Coronavirus Update : Is Coronavirus in India and Kerala?? | Oneindia Telugu

చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అత్యంత ప్రమాదకర 'కరోనా వైరస్' భారతీయులనూ కాటేసింది. సౌదీ అరేబియాలోని అల్ హయత్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న ఓ కేరళ నర్సుకు వైరస్ సోకినట్లు టెస్టుల్లో తేలిందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ గురువారం వెల్లడించారు. బాధిత నర్సుతోపాటు అల్ హయత్ ఆస్పత్రిలో సుమారు 100 మంది భారతీయ నర్సులు పనిచేస్తున్నారని, వారిలో 30 మందిని టెస్టుల కోసం తరలించారని, అయితే వైరస్ సోకినట్లు ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపారు.

ఐసోలేడెట్ వార్డులో చికిత్స..

ఐసోలేడెట్ వార్డులో చికిత్స..

కరోనా వైరస్‌కు గురైన బాధిత నర్సు కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందినవారని, అనుమానిత జాబితాలో ఉన్న 30 మంది నర్సలు కూడా కేరళవాసులేనని తెలిసింది. వైరస్ బారిన పడిన నర్సును.. సౌదీలోనే అజీర్ నేషనల్ హాస్పిటల్ కు తరలించారని, అక్కడి ఐసోలేడెట్(ఇతరులు ప్రవేశించని) వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని మంత్రి మురళీధరన్ చెప్పారు. అనుమానితులకు కూడా అదే తరహాలో పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు.

కేరళ సీఎం ఆందోళన.. కేంద్రానికి లేఖ..

కేరళ సీఎం ఆందోళన.. కేంద్రానికి లేఖ..


సౌదీ అరేబియాలో పనిచేస్తోన్న కేరళ నర్సులు కరోనా వైరస్ కు గురయ్యారన్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు. కేరళ నర్సులకు మెరుగైన చికిత్స అందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్థించారు.

అసలేంటీ కరోనా?

అసలేంటీ కరోనా?

కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించగానే.. ముందు జలుబు, దగ్గుతో మొదలై.. తర్వాత జ్వరంగా మారడం.. చివరికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తి ప్రాణాపాయ స్థితికి దారితీయడం జరుగుతుంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి చైనాలో ఇప్పటికే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా నుంచి రాకపోకల వల్ల జపాన్, కొరియా, థాయ్‌లాండ్, అమెరికా దేశాలకు కూడా ఈ వైరస్ వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.

ఎలా పుట్టింది?

ఎలా పుట్టింది?


విదేశాల్లోని ఇండియన్స్ అందరూ సేఫ్ గా ఉన్నారని భావిస్తోన్నవేళ.. మంత్రి మురళీధరన్ ప్రకటన ఒక్కసారే కలకలం రేపింది. డాక్టర్లు ‘నోవల్ కరోనా వైరస్‘గా పిలుస్తోన్న ఈ మహమ్మారి.. చైనాలోని తాచు పాముల వల్ల వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు అన్ని దేశాల ఎయిర్ పోర్టుల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని థర్మల్ స్కానర్లతో పరీక్షలు చేసిన తర్వాతే వదులుతున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో బుధవారం ఒక్కరోజే 12వేల మంది ప్రయాణికులకు కరోనా స్క్రీనింగ్ టెస్టులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.

English summary
Kerala Nurse Working In Saudi infected with Coronavirus, CM Asks Centre to Take Urgent Steps
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X