వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజాగ్రత్తతో ఉండి ఉంటే ఈ కేరళ నర్సింగ్ యువతుల బతుకులు ఏమౌనో..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరులో యువతులను విదేశాలకు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేరళకు చెందిన 32 మంది నర్సింగ్ విద్యార్థులను ఈ ముఠా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్మేనియాకు తరలిస్తుండగా విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

లేని కోర్సు ఉన్న యూనివర్శిటీకి వెళుతుండటంతో అనుమానం

లేని కోర్సు ఉన్న యూనివర్శిటీకి వెళుతుండటంతో అనుమానం

బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో యువతులను విదేశాలకు తరలించి వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు బెంగళూరు ఇమ్మిగ్రేషన్ అధికారులు. కేరళకు చెందిన 32 మంది నర్సింగ్ పూర్తి చేసిన విద్యార్థులను టామ్ అనే వ్యక్తి అర్మేనియాకు తీసుకుపోయేందుకు ప్రణాళిక రచించాడు. నర్సింగ్ పూర్తి చేసుకున్న యువతులకు విదేశాల్లో మంచి ఉద్యోగాలు రావాలంటే జర్మన్ భాష తప్పకుండా నేర్చుకోవాల్సిందే అంటూ నమ్మ బలికి వారిని జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆఫ్ అర్మేనియా లో జర్మనీ భాష నేర్పిస్తారని నమ్మబలికాడు.అంతేకాదు కోర్సు రెండు నెలల్లో పూర్తి అవగానే తిరిగి తనే టికెట్ డబ్బులు ఇచ్చి భారత్‌కు తీసుకువస్తానని కూడా చెప్పాడు.

జర్మనీ భాష నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎర

జర్మనీ భాష నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎర

జర్మనీ భాష నేర్చుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు విమానం టికెట్ కోసం రూ.30వేలు కోర్సు కోసం 1200 డాలర్లు టామ్‌కు చెల్లించారు. ఇక మంగళవారం ఉదయం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి అర్మేనియా వెళ్లేందుకు విమానం ఎక్కాల్సి ఉండటంతో ఈ యువతులందరూ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు టామ్‌కూడా చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ చేయగా అసలు యూనివర్శిటీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఆఫ్ అర్మేనియాలో జర్మన్ భాష కోర్సు లేదని తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి టామ్‌ను అప్పగించారు.

వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం

వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం

ఓ పేపర్లో వచ్చిన ప్రకటన చూసి టామ్‌ను కలవడం జరిగిందని ఓ యువతి పేర్కొంది. టామ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని మంగళూరులో నిర్వహిస్తుంటారని పోలీసులు తెలిపారు. పోలీసులు మొత్తం 32 మంది యువతుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. యువతులు అప్లై చేసుకున్న యూనివర్శిటీలో జర్మన్ భాష నేర్పించే కోర్సు లేదని... వారిని అక్కడికి మరో ఆలోచనతో టామ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అనుమానం వస్తోందని పోలీసులు తెలిపారు. అంతేకాదు టామ్ అర్మేనియా నుంచి రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేస్తానని యువతులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు వ్యభిచారం కూపంలోకి దింపేందుకే టామ్ వ్యూహం రచించాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో టామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే టామ్‌కు ఇంతకుముందు ఏదైనా నేరచరిత ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
32 women nursing graduates from kerala, suspected to be victims of a human trafficking racket, were on tuesday rescued at Kempegowda international airport when they were on their way to pursue a short term course to learn German at University of Traditional Medicine of Armenia(UTMA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X