• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బస్సులు.. బార్బర్ షాపులు: సడలించిన తొలి 2 గంటలోనే రూల్స్ బ్రేక్: తిక్క కుదర్చిన కేంద్రం

|

తిరువనంతపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రెండోదశలో ప్రకటించిన 19 రోజుల లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశారా? అనే భావన ఏర్పడేలా కనిపించింది అక్కడి వాతావరణం. లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందు ఎలాంటి వాతావరణం ఉండేదో.. సడలింపు తరువాత అవే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి నివేదికను అందజేయాలని ఆదేశించింది.

సడలింపు వేళ: కేఫ్‌లు కిటకిట..షాపుల ముందు రద్దీ: ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు:ఇదీ అక్కడి రిలాక్సేషన్ సీన్

లాక్‌డౌన్ సడలింపులు ఆరంభమైన వెంటనే జనం రోడ్ల మీదికి వచ్చారు. బస్సు సర్వీసులూ ఆరంభం అయ్యాయి. 30 కిలోమీటర్ల దూరం వరకు రాకపోకలు సాగించేలా ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు తిరుగాడాయి. మాంసం విక్రయల దుకాణలు తెరచుకున్నాయి. బార్బర్ షాపులు జనంతో క్రిక్కిరిసిపోయి ఉండటం కనిపించింది. పాఠశాలలు, విద్యాసంస్థలకు మినహాయింపు ఇవ్వనప్పటికీ దాని అనుబంధంగా కొనసాగే దుకాణాలన్నీ తెరచుకున్నాయి. జిరాక్స్ సెంటర్లు, బుక్ స్టోర్లు యథాప్రకారం ఓపెన్ అయ్యాయి.

 Kerala opens restaurants, book shops, Centre says state govt violating MHA lockdown rules

కేరళలో నెలకొన్న తాజా పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. కేరళ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీనిపై కేరళ ప్రభుత్వానికి లేఖ రాసింది. పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఈ మేరకు ఆయన కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆయన తెలిపారు.

 Kerala opens restaurants, book shops, Centre says state govt violating MHA lockdown rules
  Odd - Even System To Be Implemented In Kerala After April 2020

  దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము జారీ చేసిన నిబంధనలను ఉల్లఘించవద్దంటూ అజయ్ భల్లా ఇదివరకే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. నిబంధనలను ఉల్లంఘించిన రాష్ట్రాల్లో సడలింపును ఉపసంహరిస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ కేరళలో అసాధారణ పరిస్థితులు నెలకొనడం పట్ల కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. తదుపరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

  English summary
  As the Kerala government looks at allowing some activities in the part of the state, including opening of restaurants, bus travel for shorter distances, the Centre has shot a letter to the Pinarayi Vijayan government saying these relaxations violate the MHA guidelines on lockdown that were issued on April 15.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more