• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్సీ మరదలు, ఇంట్లో పెళ్లి కాని బావ: దృశ్యం సినిమా చూసి..మర్డర్: అన్న పుర్రె పగలగొట్టిన తమ్ముడు

|

తిరువనంతపురం: కేరళలో రెండున్నరేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఓ హత్యోదంతం.. చిక్కుముడి ఇప్పుడిప్పుడే వీడుతోంది. ఈ హత్యలో ప్రధాన నిందితుడు.. మృతుడి సోదరుడే కావడం కలకలం రేపుతోంది. ఈ కేసును పోలీసులు తిరగదోడుతున్నారు. రెండున్నరేళ్ల కిందట సమాధి చేసిన మృతదేహాన్ని మళ్లీ వెలికి తీశారు. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు తప్పించుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో.. అతనే హంతకుడని నిరూపించడానికి పోలీసులు చేస్తోన్న ప్రయత్నం ఇది.

అనేక అనుమానాలు..

అనేక అనుమానాలు..


దృశ్యం మూవీని పోలిన ఈ ఉదంతం కేరళలోని కొల్లం జిల్లా భారతీపురంలో చోటు చేసుకుంది. మృతుడి పేరు షాజీ పీటర్. హత్యకు గురయ్యే సమయానికి అతని వయస్సు 44 సంవత్సరాలు. తన తల్లి పొన్నమ్మ తమ్ముడు సాజిన్‌ పీటర్‌తో కలిసి కొల్లం జిల్లాలోని తిరువోనమ్‌లో నివసిస్తుండే వాడు. అతనికి పెళ్లి కాలేదు. హత్యకు గురి కావడానికి ఏడాది ముందు నుంచీ కొల్లంలో నివసిస్తుండేవాడు. 2018లో ఓనమ్ సీజన్ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లాడు. తల్లి, తమ్ముడి కుటుంబంతో కలిసి నివసిస్తుండే వాడు.

తమ్ముడి భార్యపై కన్నేశాడనే అనుమానం..

తమ్ముడి భార్యపై కన్నేశాడనే అనుమానం..

సాజిన్ పీటర్‌కు పెళ్లయింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కొంతకాలం పాటు వారు సఖ్యతగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత అనుమానాలు తలెత్తాయి. అవివాహితుడైన షాజీ.. తన భార్యపై కన్నేశాడని సాజిన్ అనుమానించాడు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని భావించాడు. ఆ అనుమానం పెరిగి పెద్దదైంది. దీనితో తన రక్తం పంచుకు పుట్టిన అన్నను హత్య చేయాలని సాజిన్ పీటర్ కుట్ర పన్నాడు. 2018 ఆగస్టులో భారీ వస్తువుతో తలపై మోది, హత్య చేశాడు.

మృతదేహంపై కాంక్రీట్..

మృతదేహంపై కాంక్రీట్..


ఈ విషయాన్ని తల్లి పొన్నమ్మకు చెప్పాడు. వారిద్దరూ కలిసి షాజీ పీటర్ మృతదేహాన్ని ఇంటికి కొద్దిదూరంలో పూడ్చి పెట్టారు. మృతదేహం ఆనవాళ్లు దొరక్కుండా ఉండటానికి కాంక్రీట్‌ పోసి సమాధి కట్టేశారు. తిరువోల్లమ్ గ్రామం శివార్లలో వారు నివస్తుండటం, చుట్టూ రబ్బరు తోటలు ఉండటం వల్ల వారి ఘాతుకం బయటి ప్రపంచానికి తెలియరాలేదు. షాజీ గురించి ఆరా తీసిన వాళ్లకు తల్లి-కొడుకు కట్టుకథలు చెబుతూ నమ్మించసాగారు. పోలీసు కేసులు ఉన్నందున తప్పించుకుని తిరుగుతున్నాడని నమ్మించారు.

ఇలా బయటపడింది..

ఇలా బయటపడింది..

అక్రమ సంబంధం నెపంతో సాజిన్ తన భార్యను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. తల్లి పొన్నమ్మ కూడా అతనికి సహకరిస్తుండేది. మరోవంక- షాజీ కనిపించకపోవడం పట్ల గ్రామస్తుల్లో అనుమానాలు వ్యక్తమౌతుండేవి. ఆ అనుమానంతోనే కొందరు స్థానికులు పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తోన్న సమయంలోనే సాజిన్ భార్య పోలీసుల వద్దకు వెళ్లి నిజాన్ని వెల్లడించారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు సాజిన్ పీటర్, పొన్నమ్మను అరెస్ట్ చేశారు.

    Kerala Assembly Polls : Lord Ayyappa And All Gods With LDF Govt’ - Pinarayi Vijayan || Oneindia
    నిందితులపై కఠిన చర్యలు..

    నిందితులపై కఠిన చర్యలు..


    ఈ కేసు దర్యాప్తులో భాగంగా షాజీ మృతదేహాన్ని వెలికి తీశారు. కాంక్రీట్‌తో కప్పేయడం వల్ల ఎముకలు ముక్కలైనట్లు గుర్తించారు. వాటిని జాగ్రత్తగా సేకరించి, తిరువనంతపురంలోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. నిందితులను అరెస్టు చేసినట్లు కొల్లం డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

    English summary
    The body remains of the man who was murdered and buried by his brother at Bharathipuram here have been recovered. The man identified as Shaji Peter (44) was killed two and a half years ago.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X