వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్యాసి మీద బిషప్ 13 సార్లు రేప్, కేసు వాపస్ తీసుకో: నన్ కు భూమి, ఇల్లు, ఫాదర్ ఆఫర్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

రేప్ కేసు వాపస్ తీసుకో: భూమి,ఇల్లు ఫాదర్ ఆఫర్!

తిరువనంతపురం: అత్యాచారం చేసిన బిషప్ మీద నమోదు అయిన కేసు వెనక్కి తీసుకుంటే పోలం, నిర్మించిన ఇల్లు ఇస్తామని, రాజీ కావాలని ఒత్తిడి చేస్తున్నారని కేరళలోని క్రైస్తవ మహిళా సన్యాసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి భూమి, ఇల్లు వద్దని, న్యాయం జరగాలని బాధితురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు. రాజీ కావాలని మొబైల్ లో చర్చలు జరిపిన ఓ ఆడియో ఒకటి విడుదల కావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

13 సార్లు అత్యాచారం

13 సార్లు అత్యాచారం

జలంధర్ కు చెందిన బిషప్ ఫ్రాంకో ముల్ల్యాకల్ 2014- 2016 మధ్య కాలంలో క్రైస్తవ మహిళా సన్యాసిని (46) మీద 13 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రెండు సంవత్సరాల మధ్యకాలంలో మహిళా సన్యాసిని బెదిరించి అత్యాచారం చేశాడని కేరళలో కేసు నమోదు అయ్యింది.

బ్లాక్ మెయిల్ చేశారు

బ్లాక్ మెయిల్ చేశారు

మహిళా సన్యాసినితో పాటు మరో ఐదు మంది తనను బ్లాక్ మెయిల్ చేశారని, వారి డిమాండ్లను తాను అంగీకరించకపోవడంతో తన మీద తప్పుడు ఫిర్యాదు చేశారని బిషప్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎవ్వరి మీద అత్యాచారం చెయ్యలేదని, నేను అమాయకుడు అని, మహిళా సన్యాసిని తదితరుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బిషప్ కేరళ పోలీసులకు మనవి చేశాడు.

రాజీకి ప్రయత్నాలు

రాజీకి ప్రయత్నాలు

బాధితురాలుకు అండగా నిలిచిన మరో మహిళా సన్యాసినితో మొబైల్ ఫోన్ లో మాట్లాడిన బిషప్ కు అత్యంత సన్నిహితుడు (ఫాదర్) మీరు కేసు వెనక్కి తీసుకుంటే ఏ సహాయం చెయ్యడానికి అయినా తాము సిద్దంగా ఉన్నామని, భూమి, నిర్మించిన ఇల్లు ఇస్తామని రాజీ కావాలని చెప్పాడు. ఫాదర్ మొబైల్ లో మాట్లాడిన ఆడియో టేప్ ఇప్పుడు లీక్ అయ్యింది.

ఆంధ్రాలో బెదిరింపులు

ఆంధ్రాలో బెదిరింపులు

మీకు ప్రత్యేకంగా ఓ ఇంటిని నిర్మించి అక్కడ భద్రత కల్పించడానికి సమయం పడుతుందని మహిళా సన్యాసికి ఫాదర్ ఫోన్ లో చెప్పాడు. మీరు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లినా బెదిరింపులు వస్తాయని, వేరే బిషప్ దగ్గరకు వెళితే మంచిదని, అక్కడ ఎలాంటి బెదిరింపులు వచ్చే అవకాశం లేదని ఆ ఫాదర్ సలహా ఇచ్చాడు.

న్యాయం కావాలి

న్యాయం కావాలి

మీరు ఇచ్చే భూమి, ఇల్లు మాకు వద్దని, తనకు అన్యాయం చేసి అత్యాచారం చేసిన బిషప్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు అంటున్నది. బాధితురాలు, బిషప్ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో రెండు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Family of a Kerala based nun has alleged that a priest made a call offering land, bulding, and safety if she withdrew her complaint aganist Jalandhar bishap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X