వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో వల వేసి చేపలు పట్టిన రాహుల్ గాంధీ: సముద్రంలో ఈత, మత్స్యకారులతో ముఖాముఖి

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండ్రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. బుధవారం థంగస్సెరీ బీచ్‌లో మత్స్యకారులను కలిశారు. అంతేగాక, వారితో కలిసి పడవలో ఎక్కి చేపలను పట్టేందుకు వల కూడా వేశారు.

వడి బీచ్ నుంచి 4.30గంటలకు బయల్దేరిన ఆయన మత్స్యకారులతో గంటపాటు సంభాషించారు. బ్లూ టీ షర్ట్, ఖాకీ ప్యాంట్ వేసుకున్న కాంగ్రెస్ నేత.. అక్కడికి చేరుకున్నవారికి చేయితో ఉత్సాహంగా తన పర్యటనను కొనసాగించారు. రాహుల్ వెంట ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎంపీ, నేషనల్ ఫిషర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ టీఎన్ ప్రతాపన్ ఉన్నారు.

మత్స్యకారులతో ముఖాముఖి సందర్భంగా తనకు మత్స్యకార జీవితం అంటే ఇష్టమని చెప్పారు రాహుల్. ఈరోజు ఉదయాన్నే మత్స్యకార సోదరులను కలిసేందుకు వెళ్లాను. మత్స్యకార జీవితం ఎంతో రిస్కుతో కూడుకున్నది. అయితే, వారు పడిన కష్టంతో ఇతరులు లాభం పొందుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.కొన్నిసార్లు మత్స్యకారులు వలవేసినా చేపలు చిక్కవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Kerala: Rahul interacts with fishermen at Thangassery; ventures into sea

కేంద్రంలో ప్రత్యేక మత్య్స శాఖ ఉండాలని రాహుల్ అన్నారు. అప్పుడే మత్స్యకారుల జీవితాలకు రక్షణ లభిస్తుందని చెప్పుకొచ్చారు. కేరళ కాంగ్రెస్(యూడీఎఫ్) అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఉంటుందన్నారు. పోటీ ఉండాలని, అయితే, అది సరైన విధంగా ఉండాలన్నారు.

యూఎస్‌కు చెందిన ఓ కంపెనీకి డీప్ సీ కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కాగా, ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం పినరయి విజయన్ ఇప్పటికే ఆదేశించారు. దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

కాగా, రాహుల్ గాంధీ తన పర్యటన సందర్భంగా సముద్రంలో కాసేపు సరదాగా ఈత కొట్టారు. స్వయంగా మంచి ఈతగాడైన రాహుల్.. సముద్రంలో ఈదారు. మరో ఇద్దరు ఆయనతోపాటు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

English summary
Seeking to reach out to the fishing community in poll-bound Kerala, Congress leader Rahul Gandhi on Wednesday interacted with the fishermen at Thangassery beach in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X