వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరోయన్ నేను కాదు: ఆ లింక్‌ వ్యాఖ్యలపై సరిత

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళ సోలార్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. సీన్ లోకి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ వచ్చాడు. తనతో సీఎం కుమారుడు చాందీ ఊమెన్ కు అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన ఆరోపణలను ఆకేసులోని ప్రధాన నిందితురాలు సరితా నాయర్ ఖండించారు.

చాందీ ఊమెన్ తో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు, ఆయనకు మధ్య ఎలాంటి వివాహేతర సంబంధాలు లేవని వివరించారు. ఈ స్టోరీలోని హీరోయిన్ తాను కాదని, సోలార్ స్కాం కేసులో ఉన్న మరో నిందితురాలు ఆ హీరోయిన్ అని చెప్పారు.

అయితే వారిద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పడానికి తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే ఆమె పేరు చెప్పలేదని సరితా నాయర్ మీడియాకు చెప్పారు. చాందీ ఊమెన్, మరో మహిళ కలిసి దుబాయ్ వెళ్లినప్పటి క్లిప్పింగ్స్ కేరళ హోం శాఖ మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్ దగ్గర ఉన్నాయని అన్నారు.

Kerala Solar scam Prime accused Saritha Nair

ఆ క్లిప్పింగ్స్ బయటకు వస్తే ఎక్కడ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయో అని ఆయన భయపడి బయటపెట్టలేదని సరితా నాయర్ ఆరోపించారు. అయితే చాందీ ఊమెన్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని సరితా నాయర్ కుండలు బద్దలుకొట్టి చెప్పారు.

సీఎం ఊమెన్ చాందీ స్వయంగా తనతో మాట్లాడుతూ మీరు తన కుమారుడితో కలిసి సోలార్ కంపెనీ ప్రాజెక్టు పెట్టాలని ,అందులో మా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉంటారని, మీకు అన్ని విధాల సహాయం చేస్తానని ఆయన హామి ఇచ్చారని సరితా నాయర్ కొత్తగా బాంబు పేల్చారు.

English summary
saying he had urged her to create a company involving his family members including son Chandy Oommen to do renewable energy business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X