వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లాస్‌రూమ్‌లోనే వికృత చేష్టలు: పరీక్షకు అనుమతివ్వని స్కూల్, కోర్టుకెళ్ళిన తండ్రి

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: క్లాస్‌రూమ్‌లోనే తోటి విద్యార్థినిని కౌగిలించుకొని ఆ ఫోటోలను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేసిన విద్యార్థిని స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో బోర్డు పరీక్షలకు ఆ విద్యార్థిని అనర్హుడిగా ప్రకటించింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

చదువుకొనేందుకు వెళ్ళిన ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినిని క్లాస్‌రూమ్‌లోనే కౌగిలించుకొన్నాడు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

విద్యార్థి అనుసరించిన వైఖరి పట్ల స్కూల్ యాజమాన్యం సీరియస్ అయింది. స్కూల్ నుండి విద్యార్థిని సస్పెండ్ చేసింది. అంతేకాదు బోర్డు పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించింది.

క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిని కౌగిలించుకొన్న విద్యార్థి

క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిని కౌగిలించుకొన్న విద్యార్థి

కేరళలోని ఓ పాఠశాల్లో 16 ఏళ్ల విద్యార్థి తోటి విద్యార్థినిని క్లాస్ రూమ్‌లోపూ కౌగిలించుకొన్నారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి సస్పెండ్‌ అయ్యాడు.తిరువనంతపురంలోని ఓ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి 11వ క్లాస్‌కు చెందిన అ‍మ్మాయిని కౌగిలించుకొని, ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. దీంతో స్కూల్‌ యాజమాన్యం ఆ విద్యార్థిని సస్పెండ్‌ చేయడంతో పాటు బోర్డు పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించింది.

కొడుకు కోసం తండ్రి పాట్లు

కొడుకు కోసం తండ్రి పాట్లు

తన కొడుకు జీవితం పాడవుతుందని భావించిన ఆ విద్యార్థి తండ్రి స్కూల్‌ సస్పెన్షన్‌ ఆర్డర్‌ను సవాల్‌ చేస్తూ గత ఆగస్టులో కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే తాజాగా కోర్టు ఆ సస్పెన్షన్‌ ఆర్డర్‌ను రద్దు చేస్తూ.. . విద్యార్థుల క్రమశిక్షణ విషయం పాఠశాల ప్రతిష్టపై ఆధారపడి ఉంటుందే కానీ, పరీక్షలు రాయకుండా సస్పెండ్‌ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.

పరీక్షలకు అనుమతిపై అయోమయం

పరీక్షలకు అనుమతిపై అయోమయం

స్కూల్‌ యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిని పరీక్షలకు అనుమతించే అంశం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. దీంతో విషయం మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే బోర్డు నిర్ణయం కోసం విద్యార్థి ఎదురుచూస్తున్నారు.

రేపిస్ట్ అంటున్నారు

రేపిస్ట్ అంటున్నారు


క్షమాపణ చెప్పినప్పటికీ నన్ను ఓ రేపిస్టు అని పిలుస్తున్నారు. పరీక్షలు రాయకుంటే ఒక ఏడాది వృథా అవుతుంది. అది నేను ఊహించలేను. నాకు బోర్డు పరీక్షలు రాయలనుందని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. చదువుకునే హక్కు రాజ్యంగం కల్పించిందని తన కుమారుడి వ్యక్తిగత హక్కును ఉల్లంఘిస్తూ పాఠశాల యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుందని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
A 16-year-old student of a school in Kerala's Thiruvananthapuram has been suspended indefinitely -- over a hug that lasted too long. Worried that he may be forced to miss his Class 12 board exams, his parents are set to move the Kerala High Court against its own order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X